లైఫ్ స్టైల్: చాక్లెట్ తినడం వల్ల లాభమా? నష్టమా..?

Divya
సాధారణంగా చిన్నపిల్లలను మొదలుకొని పండు ముసలి వాళ్ళ వరకు చాక్లెట్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ముఖ్యంగా వాటి రుచి మాత్రమే కాకుండా వివిధ ఆకారాలలో అందరిని ఆకట్టుకుంటూ ఉంటాయి. అందుకే చాక్లెట్ దొరకగానే ఎంతటి పెద్దవారైనా సరే చిన్నపిల్లలు అయిపోతారనటంలో సందేహం లేదు. అయితే చాక్లెట్ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. తాజా సమాచారం ప్రకారం డార్క్ చాక్లెట్ తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గిపోతాయి. క్రమం తప్పకుండా డార్క్ చాక్లెట్ తింటే శరీర బరువు తగ్గడమే కాకుండా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కూడా కరిగిస్తుంది..
ముఖ్యంగా డార్క్ చాక్లెట్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ శరీరంలో ధమనులు, సిరుల పనితీరును మెరుగుపరిచి హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి .ఇక మన శరీరానికి ఏ కొలెస్ట్రాల్ అవసరమో ముందుగా తెలుసుకోవాలి. HDL , LDL రెండు రకాల కొలెస్ట్రాల్ లు ఉన్నాయి... ఇందులో హెచ్ డి ఎల్ మంచి కొలెస్ట్రాలు,  ఎల్డీఎల్ చెడు కొలెస్ట్రాల్.. ఏదైనా అదే సమయంలో కొలెస్ట్రాల్ శరీరంలో మితంగా ఉండాలి. దానిని మించి ఉంటే ప్రమాదం పొంచి ఉన్నట్లే. కొన్ని జీవన వ్యాయామం, ఆహారం, కొన్ని మందులతో శరీరంలో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధించవచ్చు.
ఇక క్రమం తప్పకుండా డార్క్ చాక్లెట్ తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని కూడా అదుపులో ఉంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. డార్క్ చాక్లెట్ వంటి కోకో డెరివేటివ్లలో 70% కంటే ఎక్కువ ఫాలీ ఫైనాల్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలో హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్ను పెంచడానికి,  ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయపడతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇక ముఖ్యంగా కోకో పౌడర్ ను ఉపయోగించడం కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
కోకో పౌడర్లో పాలీఫీనాల్స్ ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో మొదటి పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి డార్క్ చాక్లెట్ తినడం వల్ల శరీరానికి మంచిదే కానీ నష్టం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: