లైఫ్ స్టైల్: తులసి ఆకుల రసం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?
తులసి చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లో ఈజీగా పెరుగుతుంది. ఇందులో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఇందులో యాంటీ ఫంగల్,యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉన్నాయి. యాంటీ ఫంగల్ గుణాల వల్ల ఫంగస్ ద్వారా వచ్చే వ్యాధులను నివారించుకోవచ్చు.
సీజన్ మార్పుతో వచ్చే సీజనల్ వ్యాధులైనా దగ్గు జలుబు, వైరల్ పీవర్ తో బాధపడుతుంటారు. అలాంటి వారు ఒక గ్లాసు నీటిని తీసుకుని అందులో 10 నుంచి 12 తులసి ఆకులు వేసి బాగా మరిగించి కషాయంలో తయారు చేసుకోవాలి. కషాయమును రెండు పూటలా తీసుకోవడం వల్ల, ఇందులో అధికంగా ఉండే యాంటీ వైరల్ గుణాల వల్ల తొందరగా ఉపశమనం కలుగచేస్తాయి.
తులసి ఆకులు రసాన్ని రోజు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఎపిజెనిన్, యూజి నాలిక్ ఆసిడ్ వంటి యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు,క్యాన్సర్ కారకాలయినా ప్రీ రేడికల్స్ తో పోరాడి మన శరీరాన్ని క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతాయి.
తులసి ఆకులను రాత్రంతా ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల, ప్యాంక్రియాజ్ లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలను స్టిములేట్ చేస్తుంది. ఇన్సులిన్ తగిన ప్రమాణంలో ఉత్పత్తి అయి మధుమేహం రాకుండా కాపాడుతుంది. తులసి నీళ్లు మధువేహాదగ్రస్తులకు కూడా షుగర్ కంట్రోల్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.