పిల్లల్లో ఈ లక్షణాలు.. మధుమేహనికి సంకేతాలు?

Purushottham Vinay
ఎవరికైనా మధుమేహం ఉంటే గుర్తించడం ఈజీ. పిల్లలలో మధుమేహంకి సంబంధించిన చాలా లక్షణాలు పెద్దలు కూడా ఎదుర్కొనే విధంగానే ఉంటాయి. ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లలు చాలా వేగంగా బరువు తగ్గుతారు. ఇటువంటి పరిస్థితి మీ పిల్లలో కనిపిస్తే.. వెంటనే అప్రమత్తమవ్వాలి. ఆలస్యం చెయ్యకుండా వైద్యుడికి చూపించాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుదల కారణంగా, ఆకలి పెరగడం అనేది ప్రారంభమవుతుంది. ఆహారం తిన్న తర్వాత జీర్ణం కావడానికి శరీరం శక్తి వృథా అవుతుంది. ఇక అటువంటి పరిస్థితిలో పిల్లల్లో అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి.చాలా మంది పిల్లలు మధుమేహ రోగులు లాగే సాధారణంగా ఒక విధమైన చర్మ పరిస్థితిని అనుభవిస్తారు. దద్దుర్లు, పొరలుగా ఉండే చర్మం, పొడి తామర, చిన్న ఎర్రటి గడ్డలు లేదా మెడ, చంక, గజ్జల చుట్టూ సాధారణంగా వెల్వెట్ లాగా అనిపించే చర్మం ఏర్పడుతుంది. చర్మ పరిస్థితి గతంలో కంటే విపరీతంగా మారినట్టయితే..ఇంటి నివారణలతో పోదు.



అప్పుడు వైద్యుడిని సందర్శించి సమస్య  తెలుసుకోవటం మంచిది.మీ పిల్లల ఆకలి అకస్మాత్తుగా పెరగడాన్ని మీరు గమనించినట్లయితే, మీరు డయాబెటిస్ పరీక్ష చేయించుకోవడం మంచిది.తరచుగా మూత్రవిసర్జన చెయ్యడం ఏ వయసులోనైనా మధుమేహం  అతి పెద్ద లక్షణాలలో ఒకటి. మీ బిడ్డ చాలా తరచుగా టాయిలెట్‌కి పరిగెత్తుతుంటే, అది రక్తంలో చక్కెర స్థాయి పెరగడానికి పెద్ద సంకేతం కావచ్చు.మీ బిడ్డ స్పష్టంగా చూడటంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లయితే అది మధుమేహం  సంకేతం కావచ్చు. కేవలం ఎక్కువ టీవీ చూడటం లేదా ఎక్కువగా చదువుకోవడం వల్ల మాత్రమే కాదు.డయాబెటిక్ పేషెంట్‌కు అన్ని సీజన్లలో అధిక దాహం వేదిస్తుంది. మీ పిల్లవాడు కూడా ఎక్కువ దాహంతో నీటిని ఎక్కువగా తాగుతున్నట్టయితే..అది కూడా మధుమేహానానికి సంబంధించిన ఒక లక్షణంగా గుర్తించాలి.కాబట్టి పిల్లలకి ఈ లక్షణాలుంటే ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: