గుండె జబ్బులు రాకుండా ఖచ్చితంగా ఇవి పాటించాలి?

Purushottham Vinay
గుండె సంబంధిత వ్యాధుల లక్షణాలను సకాలంలో గుర్తించకపోవడం వల్ల చిన్న వయసులోనే గుండె పోటుకు గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. జిమ్‌లో కసరత్తులు చేస్తూ లేదా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో సంభవిస్తున్న మరణాలు ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం. అందుకు ప్రధాన కారణాలు జీవనశైలి, వేళాపాళ లేని ఆహార అలవాట్లు. వీటికితోడు కరోనా వచ్చిన వారిలో కూడా గుండె జబ్బులు పెరుగుతున్నట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఎప్పుడో 60 ఏళ్లకు రావల్సిన గుండె జబ్బులు చిన్న వయసులోనే దాపురిస్తున్నాయి.సాధారణంగా గుండెపోటు సంభవించినప్పుడు.. తీవ్రమైన ఛాతీ నొప్పి, ఆకస్మికంగా చెమటలు పట్టడం, శ్వాస ఆడకపోవడం, ఎడమ చేయి, భుజంలో నొప్పిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.గుండె పనితీరులో సమస్య ఏర్పడి, ఎటాక్ సంభవిస్తుందన్నమాట. అందువల్ల ఏ వయసువారైనా ప్రతి మూడు నెలలకోసారి గుండె పరీక్షలు చేయించుకోవడం అవసరం. 



ముఖ్యంగా లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, సీటీ స్కాన్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఊబకాయం, మధుమేహంతో బాధపడేవారికి హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ప్రమాదం ఎక్కువ. దీనితోపాటు అప్పటికే ఏదైనా గుండె సంబంధిత వ్యాధులున్నవారికి కూడా అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. గత కొన్ని నెలలుగా గుండెపోటుతో పాటు కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరుగుతున్నాయి. ఇది గుండెపోటు కంటే మరింత ప్రమాదకరం. కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తే గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా ఆగిపోయి, రోగి మరణిస్తాడు.మీకు బీపీ సమస్య ఉంటే ఖచ్చితంగా రెగ్యులర్‌గా మందులు వేసుకోవాలి.శరీర బరువు, చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి.ఆహారంలో మిల్లెట్ బ్రెడ్‌ను చేర్చుకోవచ్చు.ప్రోటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు, ఆకుపచ్చ కూరగాయలు తీసుకోవాలి.జంక్ ఫుడ్, కొలెస్ట్రాల్‌ ఉండే ఆహారాలు తినడం పూర్తిగా మానెయ్యాలి.ప్రతిరోజూ కనీసం ఏడు గంటలు నుంచి ఎనిమిది గంటలు అయినా నిద్రపోవాలి.కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి. ఎలాంటి గుండె జబ్బులు మీ దరి చేరకుండా ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: