మలబద్దకం సమస్యతో బాధపడే వారు ఇలా చెయ్యండి?

Purushottham Vinay
మంచి పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడం, నీటిని ఎక్కువగా తాగకపోవడం ఇంకా అలాగే సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం, అలాగే మారుతున్న జీవన విధానం వంటి వాటిని మలబద్దకం సమస్య రావడానికి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. మలబద్దకం సమస్యే కదా అని దీనిని అస్సలు తేలికగా తీసుకోకూడదు. దీని కారణంగా ఆకలి లేకపోవడం, ఫైల్స్, ఇంకా అలాగే వికారంతో పాటు ఇతర జీర్ణసంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.మలబద్దకం సమస్యతో బాధపడే వారు ఈ టిప్ ఫాలో అవ్వడం వల్ల మలవిసర్జన అనేది చాలా సాఫీగా సాగుతుంది. ఈ టిప్ వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. మలబద్దకాన్ని తగ్గించే ఈ టిప్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. ఈ నీళ్లు బాగా వేడయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ సోంపు గింజలను వేసి 10 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లో తీసుకోవాలి. ఈ నీళ్లు గోరు వెచ్చగా అయిన తరువాత ఇందులో ఒక టీ స్పూన్ ఆముదాన్ని వేసి బాగా కలపాలి.



ఇక ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని, చిటికెడు బ్లాక్ సాల్ట్ ను వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పానీయాన్ని ప్రతి రోజూ కూడా ఉదయం పూట ఖచ్చితంగా పరగడుపున తీసుకోవాలి. అయితే ఈ పానీయాన్ని తీసుకోవడానికి అర గంట ముందు 2 గ్లాసుల గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇలా గోరు వెచ్చని నీటిని తాగిన ఒక అర గంట తరువాత ఈ మిశ్రమాన్ని తాగాలి. ఈ టిప్ ని పాటిస్తూ రోజూ 8 నుండి 10 గ్లాసుల నీటిని తాగడం, పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వంటివి చేయాలి. ఈ టిప్ పాటించడం వల్ల మలబద్దకంతో పాటు గ్యాస్ ఇంకా అలాగే కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. మలబద్దకంతో బాధపడే వారు ఈ టిప్ పాటించడం వల్ల ప్రేగుల కదలికలల్లో మార్పులు వచ్చి మల విసర్జన అనేది సాఫీగా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: