లైఫ్ స్టైల్: పైనాపిల్ తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?
పైనాపిల్ పండ్లు లో క్యాలరీ పుడ్ అని చెప్పవచ్చు.. వీటిలో ఫైబర్, విటమిన్ సి, మాంగనీస్, విటమిన్ బి6, కాపర్, థయామిన్, ఫోలేట్, పొటాషియం, మెగ్నిషియం, నియాసిన్, పాంటోథెనిక్ యాసిడ్, రైబోఫ్లేవిన్, ఐరన్లు పుష్కలంగా లభిస్తాయి.దీంతో శరీరానికి కావాల్సిన న్యూట్రియాంట్స్ అన్ని శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.
పైనాపిల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల క్యాన్సర్ కి కారణమైయె ఫ్రీ ర్యాడికల్స్ ని తొలగించి క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతాయి. శరీర ఇమ్యూనిటీ పవర్ ని పెంచడంలో సహాయం చేస్తుంది.
ఇందులో బ్రొమెలెయిన్ అనబడే సమ్మేళనం అధికంగా ఉంటుంది. ఇది మనం తినే ఆహారంలోని ప్రోటీన్లను తొందరగా జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది. అందువల్ల నాన్ వెజ్ తిన్నవారు పైనాపిల్ పండ్లను తింటే తొందరగా జీర్ణమవుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తొలగుతాయి. ఇందులో ఉండే అధిక పైబర్ వల్ల బరువు కంట్రోల్ ఉంటుంది.
పైనాపిల్ పండ్లను తినడంవల్ల శరీరంలో తెల్లరక్తకణాలు పెరుగుతాయి. తెల్లరక్తకణాలు మన శరరానికి రక్షకభటుల్లా పనిచేస్తాయి.దీంతో వ్యాధులు, ఇన్ఫెక్షన్లు తో పోరాడి ఎటువంటి రోగాలు రాకుండా కాపాడుతాయి. మన శరరీంలో చేరే బ్యాక్టిరియా, పంగస్, వైరస్ వంటి సూక్ష్మ జీవులను ఎప్పటికప్పుడు నశింపచ్చేస్తాయి.
ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు వల్ల ఇది ఆర్తరైటిస్ సమస్య ఉన్నవారు బాగా ఉపయోగపడుతుంది. వీటిని తరచూ తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. శస్త్ర చికిత్స అయిన వారు పైనాపిల్ పండ్లను తీసుకుంటే తొందరగా రికవరీ అవుతారు. కానీ గర్భం దాల్చిన స్త్రీలు దీనికి దూరంగా ఉండాలి. లేకుంటే గర్భ శ్రావం అయే అవకాశం ఉంటుంది.