పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే ఏ విటమిన్ అవసరమో తెలుసా..!
గ్రుడ్లు..
గర్భం దాల్చిన మొదటి రోజు నుండి గర్భిణీ స్త్రీలు ఉడికించిన కోడిగుడ్డును రోజుకొకటి తీసుకోవడం వల్ల బయోటిన్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాక రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఎగ్ లోని న్యూట్రియన్స్ ఉపయోగపడతాయి.
పన్నీర్..
పాల ఉత్పత్తుల్లో ముఖ్యంగా (b7)బయోటిన్ ఎక్కువగా లభిస్తుంది.అంతేకాక ఇందులో కాల్షియం,మెగ్నీషియం అధికంగా ఉంటాయి. కావున స్త్రీలు గర్భం దాల్చిన మొదటి వారం నుంచి, వారానికి రెండు సార్లు పన్నీరు ఇవ్వడం వల్ల, ఇందులోని బయోటిన్ బిడ్డ ఆరోగ్యంగా జన్మించడానికి చాలా బాగా సహాయపడుతుంది.
అవిసె గింజలు..
అవిసె గింజలను తీసుకొని బాగా వేయించి పొడిగా చేసి, వంటల్లోను వేసుకొని తినడం వల్ల గర్భిణీ స్త్రీలకు కావాల్సిన బయోటిన్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాక పిల్లల మెదడు పెరుగుదలకు కావలసిన పోషకాలాన్ని ఇందులో దొరుకుతాయి.
అరటిపండు..
కడుపుతో ఉన్న స్త్రీలు బయోటిన్ అధికంగా పొందడానికి రోజుకు ఒక అరటి పండు తినడం చాలా మంచిది. అంతేకాక బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన పొటాషియం,మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి.
కావున ప్రతి తల్లి తన పుట్టబోయే బిడ్డ సరైన ఆరోగ్యంతో పుట్టడానికి ఈ ఆహారాలను తీసుకోవడం చాలా ఉత్తమం.