ఈ ఔషధంతో జబ్బులన్నీ మాయం?

frame ఈ ఔషధంతో జబ్బులన్నీ మాయం?

Purushottham Vinay
ఈ ఔషధాన్ని తాగడం వల్ల ఎలాంటి జబ్బులను బారిన పడకుండా ఉంటామని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి  రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ లో ఒక టీ స్పూన్ వేయించిన ధనియాలను, ఒక టీ వామును ఇంకా ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్రను వేయాలి.ఆ తరువాత ఇందులో తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా కూడా అలాగే ఉంచాలి. ఉదయాన్నే ఈ నీటిని ఒక గిన్నెలో పోసి వాటిని వేడి చేయాలి. ఒక గ్లాస్ నీరు అర గ్లాస్ అయ్యే దాకా మరిగించి వాటిని వడకట్టుకోవాలి.తరువాత ఈ నీరు గోరు వెచ్చగా అయ్యాక ఇందులో తగినంత బెల్లం వేసి కలిపి తాగాలి. ఇలా ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున ఈ నీటిని తాగడం వల్ల మనం ఖచ్చితంగా చాలా రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఈ నీటిని తాగడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే వివిధ రకాల పోషకాలు కూడా ఈజీగా లభిస్తాయి.

ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని తాగడం వల్ల అజీర్తి, మలబద్దకం, గ్యాస్ ఇంకా అలాగే అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో మలినాలు, విష పదార్థాలు కూడా తొలగిపోతాయి. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు కూడా చాలా ధృడంగా తయారవుతాయి. దగ్గు, జలుబు ఇంకా అలాగే గొంతు సమస్యలతో బాధపడే వారు ఈ నీటిని తాగడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.ఇంకా అలాగే మూత్రాశయానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ లు కూడా ఈజీగా తగ్గుతాయి.ఇంకా ఈ పానీయాన్ని తాగడం వల్ల స్త్రీలల్లో నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి కూడా తగ్గుతుంది. చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఇంకా రక్తాన్ని శుద్ధి చేయడంలో, రక్తహీనత సమస్యను తగ్గించడంలో అలాగే రోజంతా ఉత్సాహంగా ఉంచడంలో ఇంకా ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఈ పానీయం చాలా బాగా సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: