వారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?

Divya
ఈ మధ్యకాలంలో పరగడుపునే, గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకొని త్రాగటం వల్ల ఆరోగ్యానికి మంచిదని చాలామంది అలవాటు చేసుకుంటూ ఉన్నారు. అంతేకాక అధిక బరువుతో బాధపడుతున్న వారు, బరువు తగ్గడానికి నిమ్మరసం నీళ్ళు ఉపయోగిస్తున్నారు.ఇందులోని పోషకాలు శరీర జీవక్రియ రేటు పెంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభించడంతో మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.నిమ్మరసం అధికంగా తీసుకోవడం వల్ల ఇందులో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా లభించడం వల్ల ఆరోగ్యానికే కాక అందం పెరగడానికి కూడా ఎంతో సహాయం చేస్తాయి.ఇన్ని ప్రయోజనాలు కలిగిన నిమ్మరసం కొన్ని రకాల వ్యాధులు బాధపడేవారు పరగడుపున తీసుకోవడం వల్ల, వారి వ్యాధి తీవ్రత ఇంకా పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.అలాంటి వ్యాధులు ఏంటో ఇప్పుడు చూద్దాం..
 అసిడిటీతో బాధపడేవారు..
 చాలామంది సమయానికి తినకపోవడం వల్ల, వారి పొట్టలో జీర్ణాశయ ఆమ్లాలు అధికంగా విడుదలై, క్రమంగా అసిడిటీకి కారణం అవుతాయి. అలాంటివారు పరగడుపున నిమ్మరసం తీసుకోవడం వల్ల, ఇందులోని సిట్రిక్ యాసిడ్,అస్కార్బిక్ యాసిడ్ గుణాలు అసిడిటీని పెంచుతుంది. కావున అసిడిటీతో బాధపడేవారు నిమ్మరసంకు దూరంగా ఉండటం చాలా మంచిది.
వీటిగో (తోన్ని )..
ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పిల్లలు కూడా వీటిగోతో బాధపడుతున్నారు. అలాంటి వారికి విటమిన్ సి అధికంగా ఉన్న నిమ్మరసం ఇవ్వడం వల్ల వీటిగో పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున వీటిగోతో బాధపడేవారు నిమ్మరసం తీసుకోకపోవడం ఉత్తమం.
గుండెమంటతో బాధపడేవారు..
గ్యాస్ ప్రాబ్లమ్స్ వల్ల గుండెల్లో మంటతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటివారు పరగడుపున నిమ్మరసం తీసుకోవడం వల్ల,గ్యాస్ అధికంగా ఫార్మ్ అయి,గుండెల్లో మంటను పెంచే అవకాశాలు ఉంటాయి.  
కావున ఇలాంటి సమస్యతో బాధపడేవారు నిమ్మరసం తీసుకోకపోవడం ఉత్తమం.
 బోలు ఎముకల వ్యాధితో బాధపడేవారు..
బోలు ఎముకల వ్యాధితో బాధపడేవారు పరగడుపున నిమ్మరసం తీసుకోవడం వల్ల, ఎముకల్లోని గుజ్జు ఇంకా తక్కువ అయిపోయి వ్యాధి తీవ్రతను పెంచే అవకాశాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: