ఈ ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు..ఎక్కువ గుడ్లు తింటే అంతే సంగతులు..!
గ్రుడ్డు వల్ల కలిగే ప్రయోజనాలు..
గుడ్డు పోషకాల గని అని చెప్పవచ్చు.ఇందులో అధిక ప్రోటీన్, శరీరానికి అత్యవసరమైన 9 రకాల అమైనో యాసిడ్స్ , బి విటమిన్లు, డి విటమిన్, మెగ్నీషియం, కాల్షియం,పొటాషియం అధికంగా ఉంటాయి.వీటిని మితంగా తీసుకోవడం వల్ల ఇందులోని న్యూట్రియట్స్ ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. మరియు రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుందని వైద్యులు సూచిస్తారు.
గుండె సంబంధిత రోగాలతో బాధపడేవారు..
గుండె ఆరోగ్యం కోసం కావాల్సిన క్యాల్షియం,మెగ్నీషియంలు గుడ్డులోని తెల్లసోనలో అధికంగా ఉంటాయి. అందులో ఉండే పచ్చసోనలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి,గుండె సంబంధిత రోగాలను మరింత తీవ్రతరం చేస్తాయి. కావున గుండె ఆరోగ్యం కోసం రోజుకు ఒక గుడ్డు మాత్రమే తినడం చాలా మంచిది.
మధుమేహం కలవారు..
శరీరంలో క్లోమంలో గ్లూకోజ్‌ను ఎనర్జీగా మార్చే సమయంలో ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్ విడుదల అవుతుంది. దీనితో రక్తంలో షుగర్ లెవెల్స్ మరింత పెంచే అవకాశం ఉంటుంది.కావున మధుమేహంతో బాధపడేవారు,అధిక గుడ్లు తీసుకోకపోవడం ఉత్తమం.
గ్యాస్ సమస్యలు వున్న వారు..
పొట్టలో ఉబ్బరం,అజీర్తి,గ్యాస్ సమస్యలు ఉన్నవారు అధిక. గ్రుడ్లు తినకపోవడం చాలా మంచిది. ఇందులోని ఫైబర్ జీర్ణం అవ్వడానికి చాలా సమయం తీసుకుంటుంది. కావున ఆ సమయంలో అధిక గ్యాస్ ఏర్పడి, సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.