కొబ్బరి నీళ్ల ప్యాక్ తో జుట్టు సమస్యలకు చెక్ పెట్టండి..!

Divya
ఈ వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల, తలలో చెమట,చుండ్రు అధికమై దురద, జుట్టు రాలిపోవడం, నిర్జీవంగా మారడం, వంటి సమస్యలు అధికమవుతాయి. ఈ జుట్టు సమస్యలు పోగొట్టుకోవడానికి ఎన్నిరకాల షాంపూలను ఆయిల్స్ ని వాడినా ఫలితం లేక ఇబ్బంది పడుతుంటారు. వీటికి కారణము ఫంగస్, బ్యాక్టీరియా మరియు హార్మోనల్ ఇమ్బ్యాలెన్స్ ఉన్నవారికి, సరైనా పోషకాలు కలిగిన ఆహారం తీసుకొని వారికి, జుట్టు సమస్యలు అధికంగా ఉంటాయి.వీటిని పోగొట్టుకోవడానికి సహజమైన చిట్కాలే బాగా ఉపయోగపడతాయి. అందులో ముఖ్యంగా వేసవి తాపాన్ని తీర్చే కొబ్బరినీళ్లు శరీరానికి చలువనివ్వడమే కాక, వాటితో వేసుకునే ప్యాక్ ల వల్ల చుండ్రుకు కూడా ఉపశమనం కలుగుతుంది. ఆ ప్యాక్ ను ఎలా వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము..
ప్యాక్ 1: దీనికోసం మూడు స్పూన్ల కొబ్బరినీళ్ళు, ఒక స్పూన్ కలబందగుజ్జు, ఒక స్పూన్ కరివేపాకురసం కలిపి, మిశ్రమంలా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించి, అరగంటసేపు ఆరనిచ్చి, మైల్డ్ షాంపూతో జుట్టును శుభ్రపరచుకొని, హెయిర్ సీరంను అప్లై చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల, తలలోని చుండ్రుకు ఉపశమనం కలగడమే కాక, జుట్టు మెరుపును సంతరించుకుంటుంది.
ప్యాక్  2 : దీనికోసం రెండు స్పూన్ల నిమ్మరసం, రెండు స్పూన్ల కొబ్బరినీళ్లు, రెండు స్పూన్ల ఉల్లిరసం తీసుకొని బాగా కలిపి,ఆ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి మర్దన చేసుకోవాలి.అరగంట ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే సరి. ఈ ప్యాక్ లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుండ్రుకు నివారణ కలిగిస్తాయి.
ప్యాక్ 3:ఇందుకోసం గుప్పెడు మందారాకులు మరియు కరివేపాకు తీసుకొని, రెండుస్పూన్ల కొబ్బరినీళ్ళు వేసి, మెత్తని మిశ్రమంలా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని తలకు బాగా మర్దన చేసుకుని, గంటసేపు ఆరనిచ్చి, మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ను వేసుకోవడం వల్ల నిర్జీవంగా ఉన్న జుట్టు పట్టుకుచ్చులా మారడమే కాక, జుట్టు రాలడం తగ్గిపోయి, పెరుగుదల మొదలవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: