ఈ స్నాక్స్ రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Divya
ఆరోగ్యంగా ఉండటానికి భోజనంలో పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. కానీ స్నాక్స్ తినే సమయంలో, మాత్రం ఉప్పు, కారాలు, నూనెలు అధికంగా ఉన్న స్నాక్స్ తినడానికి మాత్రమే ఇష్టపడతారు.అటువంటి పరిస్థితిలో, కొన్ని ఉప్పు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కానీ సహజంగా దొరికే స్నాక్స్ తినడం వల్ల, ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి లభిస్తుంది. అటువంటి స్నాక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 డ్రై ఫ్రూట్స్ :
స్నాక్స్‌ గా పిజ్జా, బర్గర్ ల బదులుగా వాల్‌నట్‌లు, పిస్తాలు, బాదం మరియు జీడిపప్పు వంటి కొన్ని డ్రై ఫ్రూట్స్‌ని రకరకాల లడ్డులు వంటి స్నాక్స్ తీసుకోవడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
స్ట్రింగ్ చీజ్:
స్నాక్స్‌లో  చీజ్‌ వంటివి తీసుకోవడం వల్ల అందులోని  కాల్షియం ఎముకలను మరియు దంతాలను  దృఢంగా తయారు చేయడంలో సహాయపడుతుంది. మరియు ఇందులోని ప్రోటీన్, ఫైబర్ ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి.
తాజా కూరగాయల సూప్:
తాజా కూరగాయలను ముక్కలుగా కట్ చేసి స్నాక్‌గా కూడా తిసుకోవచ్చు. క్యారెట్ , దోసకాయలు వంటి మీకు ఇష్టమైన కూరగాయలను తురుము,నిమ్మరసం, 1 టీస్పూన్ డ్రై సోయా, 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, మిరియాలపోడి వేసి ఊడికించి,సూప్ గా తీసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.
స్వీట్ కార్న్:
ఇందులో ఉన్న అధిక ఫైబర్, తక్కువ సోడియం, తక్కువ కేలరీల ఆహారంగా పరిగణించబడుతుంది. ఈ సందర్భంలో, స్వీట్ కార్న్‌ను ఉడకబెట్టి,వెన్నలో వేయించి, ఆపై పైన ఉప్పు చల్లి, తీసుకుంటే స్నాక్స్ రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
గుమ్మడి గింజలు:
గుమ్మడి గింజలు ,పొద్దుతిరుగుడు విత్తనాలు స్నాక్స్ గా తీసుకోవడం వల్ల అందులోని ఒమేగా 3 ప్యాటి యాసిడ్స్ , ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు , ప్రోటీన్ లు పుష్కళంగా అందుతాయి. ఇవి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. కావున ఇటువంటి స్నాక్స్ పిల్లలకి అందించడం వల్ల వారి ఎదుగుదలకి కూడా చాలా ఉపయోగపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: