మెడ నలుపు పోగొట్టడానికి సింపుల్ చిట్కా..!
అలాంటి వారు మెడపై గల నలుపును పోగొట్టుకొనేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం కలగా నిరాశ చెందుతూ వుంటారు.అలాంటివారు ఇంట్లో తయారు చేసుకునే ఈ క్రీమ్ వల్ల మెడ నలుపు చిటికలో తగ్గించుకోవచ్చు.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
దాని కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని,అందులో మూడు స్పూన్లు రోజ్ వాటర్,కొంచెం కుంకుమ పువ్వు వేసుకుని బాగా కలిపి రాత్రంతా నానబెట్టాలి.
మరసటి రోజు ఉదయాన్నే కుంకుమ పువ్వు వాటర్ లోకీ రెండు స్పూన్లు కలబంద గుజ్జు ,ఒక స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్,కొంచెం రోజ్ ఎసెన్షియల్ ఆయిల్, చిటికెడు సాధారణ పౌడర్ వేసుకుని,బాగా కలిపి మెత్తని మిశ్రమం తయారు చేసుకోవాలి.ఈ మిశ్రమంను ను ఒక బాక్స్ లో వేసి,ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు వాడుకోవచ్చు .
వాడే విధానం..
ప్రతిరోజు ప్రొద్దున స్నానం చేయడానికి ముందు,మరియు రాత్రి నిద్రించే సమయం ముందు మన తయారు చేసుకున్న మిశ్రమాన్ని మెడకు బాగా పూసి, మేడకు బాగా మర్దన చేసుకోవాలి. ఇది బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు హోమ్ మేడ్ క్రీమ్ ను రాస్తే ఎంత నల్లగా ఉన్న మెడ అయినా సరే,నెల రోజుల్లోనే తెల్లగా, మాయిశ్చరైజింగ్ గా , కాంతివంతంగా తయారవుతుంది.
ఈ మిశ్రమాన్ని ముఖానికి కూడా ఉపయోగించవచ్చు.ఇది మొఖం యొక్క స్కిన్ టోన్ ను పెంచడానికి, మొటిమలు మరియు మచ్చలను తగ్గించడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది.