గ్యాస్ సమస్యని తరిమికొట్టే సింపుల్ టిప్స్?

Purushottham Vinay
ఇక గ్యాస్ ను నలుగురి మధ్య వదలాలంటే చాలా షేమ్ గా ఉంటుంది. వదలకపోతే కడుపంతా కూడా చాలా ఉబ్బరంగా ఉంటుంది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. కొందరికి అయితే సౌండ్ లేకుండా గ్యాస్ బయటకు వెళ్ళిపోతుంది, కానీ చాలా వాసన వేస్తుంది. ఏ విధంగా చూసినా అతిగా గ్యాస్ పోవడం అనేది నిజంగా చాలా ఇబ్బందికరమైన సమస్యే..శరీరంలో వాతం పెరగడం వల్ల ఇలా అవుతుంది.చాలా మందికి కూడా గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఇది వస్తున్నప్పుడు నలుగురిలో ఉన్నామని దాన్ని బయటకు వదలడానికి ఇబ్బంది పడి కంట్రోల్ చేసుకుంటే అది శరీరంలో ఖచ్చితంగా అనేక వాత సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో ఉన్న వాతం తగ్గడానికి వెచ్చగా ఉన్న ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే తేలికగా సులభంగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే తినాలి. ఇంకా చల్లగా ఉన్నవి, పచ్చిగా ఉన్నవి, పొడిగా, గట్టిగా ఉన్న పదార్థాలు అస్సలు తీసుకోకూడదు.



 ఇక ప్రతి రోజూ కూడా భోజనం చేసేటప్పుడు చిటికెడు వాము పొడిని అన్నంలో వేసి అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని కనీసం ఒక ముద్ద అయినా మీరు తినాలి.ఇక వాము అన్నంతో భోజనం ప్రారంభించాలి. దీనివల్ల వాతం చాలా ఈజీగా తగ్గుతుంది.ఈ గ్యాస్ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఒకటి రెండురోజుల పాటు భారీ ఆహారాన్ని మీరు వదిలిపెట్టాలి.శొంఠి పొడి, బియ్యం పిండి, బియ్యం నూక, గోధుమ నూక ఇంకా ఓట్స్ వంటి పదార్థాలతో తేలికపాటి ఆహారం తీసుకోవాలి.కందిపప్పు లాంటి వంటింటి పప్పులు వాడుకునే ముందు వాటిని ముందుగా నీటిలో నానబెట్టి ఆ తరువాతే వాటిని వండుకోవాలి. ఇంకా వంటల తయారీలో కూడా ఇంగువ, జీలకర్రని బాగా ఉపయోగించాలి. వీటివల్ల శరీరంలో వాతం తగ్గి గ్యాస్ సమస్య కంట్రోల్ అవుతుంది.మరీ ముఖ్యంగా చాలామంది వేళకు ఆహారం తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతుంది.ఆహారం విషయంలో సమయపాలన మైంటైన్ చేస్తూ పైన తెలిపిన చిట్కాలు పాటిస్తే అంతా కూడా ఈజీగా చక్కబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: