అమెరికాను వణికిస్తున్న ఆర్థిక సంక్షోభం?
కానీ చట్ట సభల్లో చేసిన చట్టం ప్రకారం 31 ట్రిలియన్ డాలర్ల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ అప్పు తీసుకోకూడదు. మరి ఎక్కువ అప్పు చేయాలని బైడెన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని ట్రంపు వర్గీయులు ప్రతిపక్ష పార్టీ అయిన రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. దిగువ సభలో ట్రంపు మద్దతుదారులే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం వీరు సంతకం పెడితేనే అప్పులు ఎక్కువ తీసుకుని ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడవచ్చు.
కానీ ఇప్పట్లో అది తెగేలా లేదు. జూన్ 1 లోపు ఫైల్ పై సంతకం అయిపోతేనే అప్పులు సాంక్షన్ అవుతాయి. తద్వారా ఉద్యోగులకు డబ్బులు చెల్లించవచ్చు. ఇలా చెల్లించిన పక్షంలో అమెరికా ఆర్థిక సంక్షోభం ముదిరి దాదాపు 7 లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇలాంటి పరిస్థితులను నాలుగైదు సార్లు అమెరికా ప్రభుత్వాలు ఎదుర్కొన్నాయి. కానీ ప్రతిపక్షాల సపోర్టుతో బిల్లులు గట్టెక్కి సంక్షోభం నుంచి బయటపడ్డాయి. అమెరికా ఇంతటి ఆర్థిక సంక్షోభం ఎదుర్కొవడం వల్ల ప్రపంచ దేశాల్లో ఉన్న పలువురు భయపడుతున్నారు.
అమెరికా ప్రభావం తమ దేశాలపై ఎక్కడ ఆర్థికంగా దెబ్బతీస్తుందోనని నిశితంగా గమనిస్తున్నాయి. ఒక వేళ ఉద్యోగాలు పోతే ఎంతమంది ఆయా దేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి అమెరికా ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటుంది. ట్రంపు సహకరిస్తాడా.. బైడెన్ ఈ సమస్య నుంచి గట్టెక్కుతాడా లాంటి వేల ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. మరి ఏ విధంగా సమస్య తీరుతుందో చూడాలి.