జీవితంలో స్థిరపడాలి అంటే వినాయకుని పూజ ఇలా చేయండి..!!
అనుకున్న ఉద్యోగంలో తొందరగా స్థిరపడాలి అంటే సంకష్ట చతుర్దశి వారికి మంచి ఫలితాన్ని ఇస్తుందని వేద పండితులు చెబుతున్నారు.దీనికోసం సంకష్ట చతుర్దశి రోజు వినాయకుని పూజ చేసి రోజంతా ఉపవాసం ఉండి, వినాయకునికి ఇష్టమైన మోదకాలు సమర్పించాలి. ఇలా 16 సంకష్ట చతుర్దశి పూజలు చేయడం వల్ల,వారి జాతకంలో కానీ,ఇంట్లో కానీ ఏమైనా దోషాలు ఉంటే తొలగి తమ ఉద్యోగం తమకు దక్కుతుంది.అంతే కాక ఈ సంకష్ట చతుర్దశి అనేది పిల్లల జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండడం కోసం తల్లి అయిన చేయడం ఉత్తమం.
వ్యాపారంలో ఎటువంటి నష్టాలు లేకుండా,వృద్ధి చెందాలి అంటే,ఆ కుటుంబ యజమాని పసుపు వినాయకుని పూజలు చేయాలి.ఈ పూజ కోసం తమలపాకులో పసుపు వినాయకుని చేసి,పూలు పండ్లు సమర్పించి లక్ష్మీ గవ్వలతో మాలలో గూర్చి వేయాలి.ఇలా చేయడం వల్లవ్యాపార స్థానంలోకుబేరునిఆవాహం జరిగి,తొందరగా వ్యాపారం వృద్ధి చెందుతుంది.
కొంతమంది తల్లులు తమ బిడ్డలు తమ మాట వినట్లేదని,మరియు తమ జీవితంపై సరైన అవగాహన లేదని తెగ వాపోతూ ఉంటారు.ఇలాంటి తల్లులు వినాయకునికి ఏడు బుధవారాలపాటు,108 ప్రదక్షిణాలు చేసి,గంగాజలముతో వినాయకుని శుభ్రం చేసి పసుపు కుంకుమలు వేసి,పూజలు నిర్వహించాలి.దీనితో వినాయకుని అనుగ్రహం వల్ల,తల్లిదండ్రులపై గౌరవం పెరిగి, క్రమంగా వారి మొండితనం విడిచి,క్రమంగా మాట వినడం నేర్చుకుంటారు.మరియు వారి విద్య,ఉద్యోగాల్లో పురోగతి చెందుతారు.కావున జీవితంలో తొందరగా స్థిరపడాలంటే పై నివారణలు కచ్చితంగా పాటించి,మంచి ఫలితాలు పొందడం ఉత్తమం.