ఇప్పుడు చెప్పే టిప్ ని పాటిస్తే మీరు పాలను ఫ్రిజ్‌లో ఉంచకుండా కూడా 24 గంటలు తాజాగా ఉంచవచ్చు.అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.పాలు వేడి చేయడానికి ఖచ్చితంగా శుభ్రమైన పాత్రలను ఉపయోగించాలి..అయితే కొన్నిసార్లు మనం పాత్రలు శుభ్రంగా ఉన్నాయని అనుకుంటాము. కానీ, అలా ఉండదు అందుకే మీరు పాలు కాచినప్పుడల్లా, పాత్ర శుభ్రంగా ఉందో లేదో ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే శుభ్రం చేసిన తర్వాత కూడా మరోసారి నీళ్లతో కడుక్కోవడం మంచిది. ఆ తరువాత పాత్రలో పాలు పోయడానికి ముందు ఆ గిన్నెలో ఖచ్చితంగా కొన్ని నీళ్లు పోయాలి. ఇక ఇది పాలు పాత్ర అడుగున అంటుకోకుండా ఉంటుంది. అలాగే క్రీమ్ బాగా పడుతుంది. వేసవి కాలంలో పాలు పెరుగుకాకుండా ఉండాలంటే 24 గంటల్లో నాలుగు సార్లు దాన్ని మరిగించాలి. ఇక పాలు మరుగుతున్న సమయంలో గ్యాస్ మంటను సిమ్‌లో పెట్టుకోవాలి. ప్రతిసారీ కూడా రెండు మూడు సార్లు పాలు మరిగిన తర్వాతే గ్యాస్‌ను ఆఫ్ చేయాలి. ఆ పాలు గోరువెచ్చగా అయిన తర్వాత ఒక ప్లేట్‌తో కొద్దిగా మూత పెట్టుకోవాలి.కొన్నిసార్లు పాలు పూర్తిగా మూతపెట్టినా కూడా అవి విరిగిపోతుంటాయి.
ఇంకా అలాగే, మనం తరచూగా పాలను టైమ్‌కు మరిగించటం మరచిపోతుంటాము. ఇది ఖచ్చితంగా పాలు విరిగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాంటి పరిస్థితిలో ఆ పాల్లల్లో కొంచం బేకింగ్ సోడాని కనుక వేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందు కోసం మీరు పాలను మరిగించేందుకు గానూ.. గ్యాస్ మీద ఉంచినప్పుడు దానికి చిటికెడు బేకింగ్ సోడా వేసి,తరువాత ఒక చెంచా సహాయంతో కలపండి. అప్పుడు ఆ పాలు పగిలిపోకుండా ఉంటాయి. అయితే, ఇక్కడ బేకింగ్ సోడాని అధికంగా వేస్తే కూడా పాలు పాడయ్యే ప్రమాదం ఉందని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఒకవేళ పాలను ఒక గిన్నెలోంచి మరో దాంట్లోకి మార్చవలసి కనుక వస్తే మార్చే గిన్నెను ముందుగా వేడి నీటితో బాగా కడుక్కోవాలి. లేదంటే ఒక గ్లాసు నీళ్లు పోసి కొంచెం సేపు స్టవ్‌మీద మరిగించాలి. ఇలా చేయటం వల్ల పాలు విరిగిపోయే అవకాశం ఉండదు.