నోటిలో పుండ్లు చిటికెలో తగ్గాలంటే..?

Purushottham Vinay
నోటిలో పుండ్లు ఉంటే ఎంత బాధగా ఉంటుందో ప్రత్యేకంగా . ఈ పుండ్ల వల్ల ఆహారం తీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. ఏది తిన్నా కూడా నోరంతా బాగా మండుతుంది. అయితే ఈ నోటి పూత కోసం ఎక్కువ మంది డాక్టర్ల దగ్గకు వెళతారు.. అలాగే మరికొందరు అయితే  టాబ్లెట్లు వాడతారు. కానీ చాలా మందికి కూడా తెలియంది ఏమిటంటే.. కిచెన్‌లో ఉండే కొన్ని ఆహార పదార్థాలతో నోటిపూతను చాలా ఈజీగా  తగ్గించుకోవచ్చు. అవేంటో ఇపుడు మనం తెలుసుకుందాం..తులసి మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి.పలు రకాల అలర్జీలు ఇంకా అనారోగ్య సమస్యలను తగ్గించడంలో తులసి ఆకులు చక్కగా పనిచేస్తాయి.అందుకే రోజులో నాలుగైదుసార్లు ఖచ్చితంగా తులసి ఆకులు నమలడం ద్వారా నోటి అల్సర్‌కు ఈజీగా చెక్ పెట్టవచ్చు. తులసి ఆకులు నమిలేటప్పుడు కొద్దిగా నీటిని తీసుకున్నట్లయితే ఆకుల రసం నోరంతా కూడా వ్యాపించి ఇంకా తొందరగా ఉపశమనం కలుగుతుంది. అలాగే కూరల్లో వాడే కొత్తిమీరలో మంటను తగ్గించే యాంటీ సెప్టిక్‌, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి.



ఇవి నోటి అల్సర్ల వల్ల కలిగే నొప్పిని ఈజీగా తగ్గిస్తాయి. ఈ కొత్తిమీర ఆకులను తీసుకొని వేడి నీటిలో వేసి ఉడికించి ఇక వాటిని చల్లార్చిన తర్వాత ఆ రసంతో రోజుకు మూడుసార్లు పుకిలిస్తే ఈజీగా నోటి అల్సర్‌ నుంచి ఉపశమనం కలుగుతుంది.ఉల్లిగడ్డలోని సల్ఫర్ గుణాలు నోటి ఆల్సర్లను తగ్గించడంలో బాగా సహాయపడతాయి. చిన్న ఉల్లిగడ్డ ముక్కను నోటిలో అల్సర్ అయిన చోట ఉంచినా లేదా ఉల్లిరసంతో నోటిని పుకిలించినా ఫలితం ఉంటుంది. నోటి అల్సర్లను తగ్గించడంలో తేనె కూడా చాలా బాగా పనిచేస్తుంది.ఇక అల్సర్ల కారణంగా నోరు పొడిబారుతుంది కాబట్టి .. నోటి పూత ఉన్న చోట తేనెను పూసినప్పుడు నోరు తేమగా మారి మంచిగా ఉపశమనం కలుగుతుంది. తేనెలో ఉండే యాంటీమైక్రోబయాల్ గుణాల వల్ల అల్సర్లకు కారణమయ్యే బ్యాక్టీరియా త్వరగా నాశనం అవుతుంది. ఇంకా తొందరగా తగ్గాలంటే తేనెతో పాటు కొద్దిగా పసుపు కూడా రాసినట్టయితే ఈజీగా ఉపశమనం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: