పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గడానికి కారణాలు ఏంటో తెలుసా..?
బ్లూ స్క్రీ లు..
బ్లూ స్క్రీన్లు కలిగిన టీవీ మరియు మొబైల్ లు ఎక్కువగా చూడటం వల్ల మెదడు పనితీరు మందగించి, జ్ఞాపకశక్తి తగ్గుతూ వస్తుంది.దీనితో వారు తోటి వారి పేర్లను కూడా మర్చిపోతూ ఉంటారు కూడా.దానికి కారణం ఎక్కువగా మొబైల్ లో గేమ్ ఆడటం, ఆడియోలు,వీడియోలు చూడడం వల్ల మెదడు ఆలోచన శక్తిని కోల్పోతూ ఉండడమే.కావున ఎంత స్క్రీన్ వాడకం తగ్గిస్తే అంత మంచిది.
అధిక ఆహారం తీసుకోవడం...
చాలామంది పిల్లలు టీవీ మొబైల్ చూస్తూ ఏం తింటున్నామో కూడా లెక్క చేయకుండా,అధిక చెక్కరలు మరియు కొలెస్ట్రాల్ ఉన్న జంక్ ఫుడ్ లను స్వీట్ లను ఎక్కువగా తింటూనే ఉంటారు.మరియు కొంతమందికి ఏదో ఒకటి తింటూ ఉంటేనే కానీ వారి రోజు గడవదు అన్నట్టు ఉండే పిల్లలు కూడా ఉన్నారు.ఇలా చేయడం వల్ల క్రమంగా మెదడు పనితీరు దెబ్బతిని,ఆలోచన శక్తి మందగిస్తుంది.అంతేకాక వారి జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
శారీరక శ్రమ లేకపోవడం..
చాలామంది పిల్లలకు అవుట్డోర్ గేమ్స్,వ్యాయామం మరియు నడక వంటి ఎటువంటి శారీరక శ్రమ లేకపోవడం వల్ల మెదడు కూడా నిద్రావస్థకు చేరి,జ్ఞాపక శక్తిని దెబ్బతీస్తుంది కూడా.కావున ఇటువంటి వాటికి దూరంగా ఉంచి,మీ పిల్లల్లో మెదడు పెరుగుదలకు,మరియు జ్ఞాపకశక్తి మెరుగు
పడేందుకు జాగ్రత్త పడటం తల్లిదండ్రుల వంతే.