మనం తిన్న ఆహారం ఖచ్చితంగా జీర్ణమవ్వాలంటే జీర్ణరసాలతో పాటు కొన్ని రకాల ఎంజైమ్ లు కూడా మనకు చాలా అవసరం. ఆహారం జీర్ణం అవ్వడానికి పైత్య రసం, ప్రాంకియాటిక్ రసాలతో పాటు ఇంకా అలాగే ఎమైలేజ్, ప్రొటిలేజ్, లైపేజ్ అనే ఎంజైమ్ లు కూడా చాలా అవసరం.ఇవి సరిగ్గా విడుదల అయితేనే మనం తిన్న ఆహారం పులవకుండా త్వరగా జీర్ణం అవుతుంది.ఇక అజీర్తి సమస్యతో బాధపడే వారికి మందులు, టానిక్ లను ఇవ్వడం వల్ల ఈ జీర్ణ రసాలు ఇంకా ఎంజైమ్ లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీంతో తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది.అలాగే పుల్లటి త్రేన్పులు రాకుండా ఉంటాయి. అయితే మందులు వాడకుండా న్యాచురల్ గా కూడా మనం అజీర్తి సమస్యను తగ్గించుకోవచ్చు. ఇంకా పుల్లటి త్రేన్పులు రాకుండా చూసుకోవచ్చు. అజీర్తి, పుల్లటి త్రేన్పులు వంటి సమస్యలతో బాధపడే వారు జీరా వాటర్ ను తాగడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ జీలకర్రలో థైమాల్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది ఆహారం జీర్ణం అవ్వడానికి అవసరమయ్యే ఎంజైమ్ లను ఇంకా జీర్ణ రసాలను ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో సహాయపడుతుంది. ఈ జీలకర్ర నీటిని తాగడం వల్ల జీర్ణరసాలు, ఎంజైమ్ లు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి తిన్న ఆహారం పులియకుండా చాలా త్వరగా జీర్ణమవుతుంది.
దీంతో అజీర్తి, పుల్లటి త్రేన్పులు, పసురు రావడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. పొట్ట బాగా శుభ్రపడుతుంది. అజీర్తి సమస్యను తగ్గించే ఈ జీలకర్ర నీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నీటిని తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోయాలి.తరువాత ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసి నీటిని మరిగించాలి. ఈ నీటిని ముప్పావు గ్లాస్ అయ్యే దాకా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఆ తరువాత ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా అయ్యే దాకా ఉంచాలి. ఇలా తయారు చేసుకున్న జీలకర్ర నీటిని రోజూ ఉదయం పూట పరగడుపున తీసుకోవాలి.ఈ సమస్య మరీ తీవ్రంగా ఉన్నవారు రోజూ ఉదయం ఇంకా సాయంత్రం రెండు పూటలా ఒక కప్పు మోతాదులో తీసుకోవాలి. ఇలా వారం నుండి పది రోజుల పాటు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల తిన్న ఆహారం పులియకుండా చాలా చక్కగా జీర్ణమవుతాయని , ఇంకా పుల్లటి త్రేన్పులు, అజీర్తి సమస్యలు తగ్గి పొట్ట చక్కగా శుభ్రపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.