స్కూల్ వయస్సులోనే ప్రేమలో పడితే?
15 సంవత్సరాలు కూడా రాక ముందే లవ్ ట్రాక్ లు నడిపించి సరైన గమ్యం లేక లక్ష్యం మరిచి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సర్వ సాధారణంగా స్కూల్ డేస్ లో ప్రెండ్ షిప్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని చాలా మంది మిస్ యూజ్ చేసుకుని లవ్ అని భ్రమలో పడి నష్టపోతున్నారు. చాలా మంది మేజర్ లు కాకముందే లేచిపోవడాలు తర్వాత తప్పు తెలుసుకుని రావాలని ప్రయత్నించినా వారికి వచ్చేందుకు వీలు లేక ఇబ్బంది పడుతున్నారు.
కొంతమందికి పిల్లలు పుట్టడం వల్ల వారిని పోషించుకోలేక గొడవలు పడుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని బోర బండలో ఒకటి జరిగింది. ఎనిమిదో తరగతి నుంచే చదువుకుంటున్న ఇద్దరు బాల బాలికలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇప్పడు 17 సంవత్సరాలు ఉన్నాయి. వారి పెళ్లయి మూడు సంవత్సరాలు అవుతోంది. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు. మైనర్లయిన ఆ జంటకు ఒక బాబు జన్మించాడు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది.
బాలుడిని మైనర్ భర్త తీవ్రంగా కొట్టడం చంపాలని చాలా సార్లు ప్రయత్నం చేయడం బాలిక అడ్డుకోవడం జరిగింది. ఈ మధ్య ఆ బాలిక ఉండగానే చిన్నారిని నేలకేసి కొట్టడంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చిన్నారి చికిత్స పొందుతోంది. దీంతో మైనర్ బాలిక భర్త ఇలా వేధిస్తున్నాడంటు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. దీంతో వయసుల వారీగా వారి వివరాలు తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు. మైనర్ల వివాహాం ఎంతటి దారుణానికి దారి తీస్తుందో వీరి వివాహామే ఉదాహరణ అని చెబుతున్నారు.