లైఫ్ స్టైల్: పైనాపిల్ తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
క్యాలరీలు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే బరువు పెరుగుతారు కాబట్టి క్యాలరీలు తక్కువగా ఉండే ఈ పండు తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు కేలరీలను అందించకుండా చూడవచ్చు. అంతేకాదు ఇందులో ఫైబర్ కూడా చాలా పుష్కలంగా లభిస్తుంది. 100 గ్రాములకు 2.3 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. వీటిని తినడం వల్ల ఆకలి వేయకుండా కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది. ఫలితంగా బరువు త్వరగా తగ్గవచ్చు. ముఖ్యంగా పైనాపిల్ లో బ్రోమోలైన్ అనే ఎంజైమ్ ఉండడం వల్ల జీవక్రియ రేటును పెంచుతుంది.
అధిక జీవక్రియ రేటు ఉంటే శరీరం క్యాలరీలను వేగంగా కరిగించి వేస్తుంది. కాబట్టి బరువు తగ్గడానికి దారితీస్తుంది. ముఖ్యంగా ఇందులో యాంటీ ఇన్ఫ్లమెంటరీ సమ్మేళనాలు ఉన్నాయి కాబట్టి శరీరంలో మంటను కూడా తగ్గిస్తాయి. ఇందులో ఉండే పోషకాలు విషయానికి వస్తే విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ b6 ,పొటాషియం లాంటి కణజాలు ఎక్కువగా ఉన్నాయి. శరీరంలో నీటి నిలుపుదల ఉబ్బరం బరువు పెరగడానికి కారణం కావచ్చు.. కాబట్టి పైనాపిల్ తినడం వల్ల శరీరంలో నీటి నిలుపుదలను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.