హైదరాబాద్‌లో స్పా అంటే వ్యభిచార కేంద్రమేనా?
అయితే ఈమె ఉక్రెయిన్ కు వైద్య విద్య చదవాలని వెళ్లి డబ్బులు లేకపోవడంతో తిరిగి హైదరాాబాద్ వచ్చింది. అనంతరం హైదరాబాద్ లో ఈమె ఆయుర్వేదిక్ క్రాస్ మసాజ్ సెంటర్ పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. శ్రుతి భద్రాచలం పట్టణానికి చెందిన యువతి అని తేల్చారు. చదువుకోవడానికి డబ్బులు సరిపోక ఇలాంటి పనులు చేయిస్తోందని చెప్పారు. అయితే ఒక ఎంబీబీఎస్ చదువుకోవడానికి ఉక్రెయిన్ వెళ్లిన స్టూడెంట్ డబ్బులు లేక తిరిగిరావడం ఏమిటి? వచ్చిన తర్వాత లక్షల్లో ఖర్చయ్యే స్పా సెంటర్ పెట్టడం ఏమిటి? అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు డబ్బులు ఉంటే అక్కడే వైద్య విద్య చదువుకునేది అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
క్రాస్ మసాజ్ అంటే మగవారు, ఆడవారికి, మహిళలు, పురుషులకు మసాజ్ చేయడం అని అర్థం. ఇది ఆయుర్వేదిక్ దాంట్లో ఉంది. ఇది అపిషీయల్ గా చేస్తారు. కానీ క్రాస్ మసాజ్ ను వ్యభిచారంగా చూపించడం అనేది కరెక్టు కాదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి పోలీసులు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి. హైదరాబాద్ లోని చాలా బ్యూటీ పార్లర్లు, మసాజ్ సెంటర్లలో ఇదే తరహ మోసం జరుగుతోందని వారిని కూడా అరెస్టు చేయాలని ప్రజలు కోరుతున్నారు. వ్యభిచారం జరగకుండా అరికట్టాలని కోరుతున్నారు.