ఇలా చేస్తే హార్ట్ ఎటాక్ జన్మలో రాదు?

Purushottham Vinay
ప్రస్తుత కాలంలో చాలా మంది కూడా హార్ట్ ఎటాక్ సమస్యతో మరణిస్తున్నారు. యంగ్ ఏజ్ లో వున్నప్పుడే చాలా మంది హార్ట్ ఎటాక్ సమస్యతో ఎక్కువగా మరణిస్తున్నారు. అయితే ఈ హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణం మాత్రం మన రక్తనాళాలు మూసుకుపోవడమే.అందువల్ల రక్త సరఫరాలో అడ్డంకులు ఏర్పడి హార్ట్ ఎటాక్ సమస్య అనేది తలెత్తుతుంది. రక్తనాళాలు మూసుకుపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల, కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల, రక్తం గడ్డకట్టడం వల్ల, రక్తనాళాల్లో క్యాల్షియం నిల్వలు పేరుకుపోవడం వల్ల ఇంకా అలాగే ప్లేట్లెట్స్ పేరుకుపోవడం వల్ల రక్తనాళాలు మూసుకుపోయి హార్ట్ ఎటాక్ సమస్య అనేది తలెత్తుతుంది.బైపాస్ ఆపరేషన్ ద్వారా లేదా స్టంట్స్ వేయడం ద్వారా రక్తనాళాల్లో పేరుకుపోయిన ఈ పూడికలను మనం తగ్గించవచ్చు.ఈ రక్తనాళాల్లో ఉండే పూడికలు ఈజీగా తొలగిపోవాలంటే మనం కొన్ని నియమాలను పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 



అయితే ఇందులో మొదటిది ఆహారం.మనం తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా ఫైబర్ ఎక్కువగా, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి.ఇంకా అలాగే ఉప్పు, కొవ్వు పదార్థాలను సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి.మనం తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా పండ్ల రసాలను, డ్రై నట్స్ ను, మొలకెత్తిన గింజలను, పండ్లను ఇంకా అలాగే సలాడ్స్ లను 60 నుండి 70 శాతం ఉండేలా ఖచ్చితంగా చూసుకోవాలి. ఇంకా అలాగే ప్రతిరోజూ తప్పకుండా వ్యాయామం చేయాలి. అలాగే శరీరం అలసటకు గురి కాకుండా ప్రాణ వాయువు శరీరంలోకి ఎక్కువగా వెళ్లే వ్యాయామాలు ఖచ్చితంగా చేయాలి.అలాగే ఏరోబిక్స్, ప్రాణాయామం వంటి వాటిని చేయాలి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా 45 నిమిషాల పాటు ఈ వ్యాయామాలను ఖచ్చితంగా చేయాలి. ఇంకా అలాగే ఒత్తిడి మన దరి చేరకుండా కూడా చూసుకోవాలి.ఈ ఒత్తిడి కారణంగా గుండెకు రక్తప్రసరణ అనేది తగ్గుతుంది. కాబట్టి ఒత్తిడి తగ్గడానికి మెడిటేషన్ ను రోజుకు రెండు పూటలా ఖచ్చితంగా చేయాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: