ముఖంపై మొండి మొటిమలకు స్ట్రాబెరీ తో చెక్ పెట్టండి..!
స్ట్రాబెరీ లోని పోషకాలు..
స్ట్రాబెరీ బెర్రి పండ్ల కుటుంబానికి చెందినది.ఇవి మార్కెట్లో కూడా చాలా సులువుగా దొరుకుతాయి. ఇందులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ మరియు ఆంటీ బ్యాక్టీరియల్,ఆంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా లభిస్తాయి.వీటిని తరచూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి,సీజనల్గా వచ్చే చర్మ సమస్యలను కూడా తొలగించడానికి ఉపయోగపడతాయి.కావున తరచూ స్ట్రాబెర్రీలు తీసుకోవడం చాలా ఉత్తమం.ఇంకెందుకు ఆలస్యం స్ట్రాబెరితో చిట్కాలు మనము తెలుసుకుందాం పదండి..
స్క్రబ్ తయారీ విధానం..
దీనికోసం ఐదు ఆరు స్ట్రాబెరీలను తీసుకుని బాగా శుభ్రం చేసి,టవల్తో తుడచి పొడిగా తయారు చేసుకోవాలి.ఆ తరువాత ఈ పండ్లను మిక్సీ గిన్నెలోవేసి,అందులోఒక చిటికెడు పసుపు,టీ స్పూన్ల బ్రౌన్ షుగర్,ఒక స్పూన్ ఆరెంజ్ తొక్కల పొడి,వేసి బాగా మిక్సీ పట్టుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి.
వాడే విధానం..
ఈ స్క్రబ్బర్ ను రోజు స్నానం చేయడానికి అరగంట ముందు,ముఖం బాగా శుభ్రపరచుకొని ఒక స్పూన్ స్ట్రాబెరీ స్క్రబ్బర్ ను తీసుకొని,ఒక స్పూన్ శనగపిండి కలపాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా అప్లై చేసి, అరగంటసేపు ఆరనివ్వాలి.ఇలా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.ఆ తరువాత మొఖం పొడిబారక్కుండా మాయిశ్చరైజర్ రాయాలి.ఇలా ముఖాన్ని రోజు శుభ్రపరుచుకోవడం వల్ల,మొటిమలను కలిగించే బ్యాక్టిరియా నశించి,మొండి మొటిమలు తగ్గుముఖం పడతాయి.