ఒక్క జావతో కిడ్నీ ఆరోగ్యం కాపాడుకోవచ్చని మీకు తెలుసా..?
ఈమధ్య కాలంలో చాలామందికి కిడ్నీలో రాళ్లు,కిడ్నీ దెబ్బ తినడం వల్ల డయాలసిస్ చేయించుకోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతూ ఉన్నాయి.ఈ సమస్యలతోనే కాక దీనివల్ల ఎన్నో దుష్ప్రభావాలు కలుగుతూ ఉన్నాయి.అటువంటి కిడ్నీ ఆరోగ్యాన్ని కొన్ని రకాల చిరుధాన్యాలతో తయారు చేసుకునే జావలు చాలా బాగా ఉపయోగపడతాయని ఆహార నిపుణులు చెబుతూ ఉన్నారు.అవేంటో మనము తెలుసుకుందామా..
జావకు కావలసిన పదార్థాలు..
ఈ జావా కోసం మూడు టేబుల్ స్పూన్ల రాగులు, మూడు టేబుల్ స్పూన్ల అరికలు మూడు టేబుల్ స్పూన్ల సాములు,రెండు టీ స్పూన్ల జొన్నలు తీసుకుని,కడిగి ఎండబెట్టుకోవాలి.ఇలా ఎండిన ఈ చిరుధాన్యాలను పచ్చివాసన పోయేవరకు వేయించాలి.ఆ తర్వాత ఈ చిరుధాన్యాలను మిక్సీ పట్టి పొడిలా తయారు చేసుకోవాలి.ఈ పొడిని గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల,కనీసం మూడు వారాల పాటైనా వాడుకోవచ్చు.
జావా తయారీ విధానం..
ఈ జావను తయారు చేసుకోవడానికి ముందుగా రెండు గ్లాసుల నీళ్లు స్టవ్ మీద పెట్టి,అందులో తగినంత బెల్లం కానీ,షుగర్ కానీ వేసుకుని ఉడికించుకోవాలి.దీనిలోకి పైన తయారు చేసి పెట్టుకున్న పొడిని రెండు స్పూన్లు తీసుకొని ముందుగా కొన్ని నీళ్లు వేసి ఉండలు లేకుండా కలిపి,స్టవ్ మీద మరుగుతున్న నీటిలో వేయాలి.అలా బాగా ఉడికిన తర్వాత దింపి,చల్లారనిచ్చిన తరువాత,ఆ గిన్నెకు ఒక క్లాత్ కట్టి ఆరేడు గంటలపాటు నిలువ ఉంచాలి.ఇలా నిలువ ఉంచిన జావను ఒక గ్లాసు మోతాదులో తీసుకోవాలి.కిడ్నీ ఆరోగ్యం కోసం ఈ జావా తయారు చేసుకునే వారు,ఉదయాన్నే తాగాలంటే రాత్రి తయారుచేసి పెట్టుకోవడం,సాయంత్రం తాగాలంటే ఉదయాన్నే తయారు చేసి పెట్టుకోవడం ఉత్తమం.ఇలా జావను పులియబెట్టడం వల్ల,ఇందులో బి12 అధికంగా ఉత్పత్తి అవుతుంది.మరియు చిరుధాన్యాల లో అధికంగా ఉన్న ఫైబర్,మెగ్నీషియం,ఐరన్ కంటెంట్ వల్ల కిడ్నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.