పొద్దున్నే ఈ దోశ తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు?

Purushottham Vinay
మనం ఆకుకూరలల్లో ఒకటైన పాలకూరను కూడా రెగ్యులర్ గా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పాలకూర మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. అందుకే పాలకూరను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు చాలా ఈజీగా లభిస్తాయి.దీనివల్ల మన శరీర ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. పాలకూరతో మనం చాలా రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. ఇక పాలకూరతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో పాలక్ దోశ కూడా ఒకటి. ఈ పాలక్ దోశ చాలా రుచిగా ఉంటుంది. దోశ పిండి, పాలకూర ఉంటే చాలు ఈ దోశను కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఈ దోశను తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుంది. ఎంతో రుచిగా ఇంకా ఆరోగ్యంగా ఉండే ఈ పాలకూర దోశను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.



పాలక్ దోశ తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా మీరు కళాయిలో నూనె వేసి దానిని వేడి చేయాలి. ఆ నూనె వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. ఆ తరువాత తరిగిన పాలకూర, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. 
ఆ తరువాత దీనిపై మూత పెట్టి ఆ పాలకూరను పూర్తిగా మగ్గించాలి. ఇక ఆ పాలకూర మగ్గిన తరువాత స్టవ్ ని ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఆ తరువాత దీనిని జార్ లో వేసుకుని దానిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తరువాత ఈ పేస్ట్ ను దోశ పిండిలో వేసి బాగా కలపాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని ఉంచి బాగా వేడి చేయాలి. ఆ పెనం వేడయ్యాక పిండిని తీసుకుని దానిని దోశలాగా వేసుకోవాలి.ఇక ఆ దోశ తడి ఆరిన తరువాత నూనె వేసి దానిని కాల్చుకోవాలి.ఆ దోశ ఒకవైపు కాలిన తరువాత మరో వైపుకు దానిని తిప్పుకుని కాల్చుకోవాలి. ఇలా దోశ రెండు వైపులా కాలిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని చట్నీతో దాన్ని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బాగా రుచిగా ఇంకా ఆరోగ్యంగా ఉండే పాలక్ దోశ తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న పిండితో మనం ఎగ్ దోశ ఇంకా మసాలా దోశను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పాలక్ దోశను తినడం వల్ల మనం రుచితో పాటు పాలకూర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: