మనలో చాలా మంది కూడా ఉదయం పూట బ్రష్ చేసేటప్పుడు నోట్లో వేళ్లు పెట్టుకుని మన చుట్టు పక్కల రెండు మూడు ఇళ్లకు వినపడేలా పెద్ద పెద్దగా అరుస్తూ పసరును కక్కుతూ ఉంటారు. గొంతులో పేరుకుపోయిన కఫాన్ని తొలగించుకోవడానికి ఇంకా కడుపులో ఉన్న పసరును తొలగించుకోవడానికి ఇలా నోట్లో వేసుకుని కక్కుతూ ఉంటారు.అలాగే కొందరు నీళ్లు తాగి మరీ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ దారుణంగా కక్కుతూ ఉంటారు. అయితే ఇలా నోట్లో వేళ్లు వేసుకుని పసరు కక్కడం అస్సలు మంచి అలవాటు కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నోట్లో వేళ్లు వేసుకుని బలవంతంగా కఫాన్ని ఇంకా పసరును కక్కడం వల్ల పొట్ట, ప్రేగులు, డయాఫ్రామ్ ముడుచుకు పోయి దగ్గరగా అవుతాయి. వాటిపై ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది.ఇలా బలవంతంగా కక్కడం వల్ల గొంతులో రక్తనాళాలు చిట్లే ప్రమాదం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తనాళాలు చిట్లి కఫం, పసరుతో రక్తం కూడా బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కొన్ని రోజులకు ఈ అలవాటు వ్యసనంగా మారి నోట్లో వేళ్లు వేసుకుని కక్కకపోతే నోటిని శుభ్రం చేసుకున్న
భావన అనేది కలగదు.
ఇలా ప్రతిరోజూ కూడా చేయడం వల్ల ప్రేగుల్లో హెర్నియా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నోట్లో వేసుకుని కక్కడం మంచి అలవాటు కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇలా ప్రతి రోజూ చేయకూడదని అవసరం ఉన్నప్పుడు మాత్రమే చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీకు తిన్న ఆహారం జీర్ణం కానప్పుడు, వికారంగా ఉన్నప్పుడు, వాంతి చేసుకుంటే బాగుండు అని
భావన కలిగినప్పుడే మాత్రమే ఇలా నోట్లో వేసుకుని కక్కాలి.ఇక నీళ్లు బాగా తాగి ఆ తరువాత నోట్లో వేళ్లు వేసుకుని కక్కాలి.అలాగే కఫం, పసరు ఉన్నట్టుగా మీకు అనిపించినప్పుడు నోట్లో వేళ్లు వేసి కక్కడానికి బదులుగా
వేప పుళ్లతో దంతాలను బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అయ్యి చిక్కగా పేరుకుపోయిన కఫం కదిలి ఈజీగా బయటకు వస్తుంది.ఇంకా అలాగే కఫం సమస్యతో ఎక్కువగా బాధపడే వారు ఎక్కువగా వేడి నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. నోట్లో వేళ్లు వేసుకుని కక్కే అలవాటు ఉన్నవారు ఇప్పటికైనా దానిని వదిలి పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.