లైఫ్ స్టైల్: ఆరోగ్యాన్ని పెంచే హెర్బల్ టీ లు ఇవే..!
అల్లం టీ:
సాధారణంగా అల్లం టీ తాగడం వల్ల వేడి చేస్తుందని అందరూ చెబుతూ ఉంటారు. అయితే వర్షాకాలం మరియు చలికాలంలో ఈ అల్లం టీ చాలా మంచిదట. పాలలో కొంచెం అల్లం మెత్తగా గ్రైండ్ చేసి అందులో వేసి.. కాస్త టీ పొడి.. కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నింటిని బాగా ఉడికించి తాగడం వల్ల గొంతు నొప్పితో పాటు జలుబు, దగ్గు సమస్యల నుంచి కూడా విముక్తి పొందవచ్చు.
గ్రీన్ టీ:
ప్రస్తుత కాలంలో గ్రీన్ టీ అధికంగా తాగడం నిషేధించబడినప్పటికీ కూడా ఉదయాన్నే కొద్దిగా గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదని.. పొట్టలోని చెడు కొవ్వును కూడా కరిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
పిప్పర్మెంట్ టీ:
మూడు కప్పుల నీళ్లల్లో మూడు పుదీనా ఆకులను తీసుకొని చేతితో ముక్కలుగా కోసి పది నిమిషాలు మరిగించి.. అందులో కాస్త తేనె కలుపుకొని మరి తాగితే ఆరోగ్యానికి మంచిది. వీటితోపాటు తులసి టీ , నిమ్మగడ్డి టీ వంటివి కూడా ఆరోగ్యానికి మంచి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.