ముఖమంతా ఈవెన్ టోన్ రావాలంటే ఈ ప్యాక్ వేసుకుంటే చాలు..!

Divya
చాలామందికి వాళ్ల చర్మ రంగు తెల్లగా ఉన్నా సరే, ముఖముపై,ముక్కు పక్కన,కళ్ళ కింద మరియు మెడ భాగంపై నలుపుదనంతో అందవిహీనంగా కనపడుతూ ఉంటారు.వారు ఎంత మంచి బట్టలు వేసుకున్నా,ఎన్ని నగలు అలంకరించుకున్న కూడా,వారి అన్ ఈవెన్ టోన్ వల్ల చాలా అసహ్యంగా కనపడుతూ ఉంటారు. అలాంటివారు ముఖమంతా ఈవెంట్ టోన్ గా కనపడాలనీ,ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ వాడి మరీ వారి ముఖాన్ని ఈవెంట్ టౌన్ గా మారుస్తూ ఉంటారు.కానీ దానివల్ల ప్రయోజనం కన్నా దుష్ప్రభావాలే ఎక్కువగా ఉంటాయి.కెమికల్ ప్రోడక్ట్ లో ఉన్న రసాయనిక గుణాలు,చర్మ ఆరోగ్యాన్ని దెబ్బ తీసి మొటిమలు, మచ్చలు,మృతకణాలు ఏర్పడేలాగా చేస్తాయి.ఎలాంటి దుష్ప్రభావాలు కలగకుండా,మీ ఇంట్లో దొరికే మ్యాచ్లో నాచురల్ ప్రొడక్ట్స్ తో వేసుకునే ప్యాక్ లు చాలా బాగా ఉపయోగపడతాయని చర్మ నిపుణులు పరిశోధనలు చేసి మరీ నిరూపించారు.మరియు తక్కువ ఖర్చు కూడా.. మరి ఆ నేచురల్ ప్రొడక్ట్స్ ఏంటో మనము తెలుసుకుందామా..

ఈ ప్యాక్ కోసం కావాల్సినవి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి,రెండు టీ స్పూన్ల రాగి పిండి,చిటికెడు పసుపు,అర కప్పు కలబంద గుజ్జు.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పైన చెప్పిన ఇంగ్రిడియంట్స్ అన్ని వేసి  బాగా మిక్స్ చేయాలి.తరువాత ఈ ప్యాక్ పెట్టుకోవడానికి ముందే ఫేస్ వాష్ చేసి శుభ్రంగా ఉంచుకోవాలి.ఇప్పుడు ఈ ప్యాక్ వేసుకొని అరగంటసేపు ఆరనివ్వాలి.ఇది బాగా ఆరిన తర్వాత నీళ్లతో తడిపి మరీ మెల్లగా మర్దన చేసుకోవాలి.ముఖ్యంగా మెడ పై నలుపుదల ఉంటుంది కావున ఆ ప్రదేశంలో బాగా మర్దన చేయాలి.ఇలా వారానికి రెండు మూడు సార్లు చేసుకోవడం వల్ల ముఖం మెడ ఈవెన్ టోన్ గా కనిపిస్తాయి.

ఈ ప్యాక్ లో వాడిన శనగపిండి వల్ల,ముఖంపై ఉన్న మృతకణాలు,జిడ్డు తొలగిపోయి ముఖం ఈవెన్ టోన్ గా మారుతుంది.మరియు రాగిపిండిలో ఉన్న ఐరన్ గుణాలు,చర్మంలోకి ఇంకిపోయి,రక్తసరఫరాను పెంచి, చర్మం ఈవెంట్ ఆన్ గా మారేందుకు ఉపయోగపడుతుంది.కావున మీరు కూడా ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేసి చూడండి.ముఖ్యంగా చర్మ ఆరోగ్యం కాపాడుకోవాలంటే,రోజుకు మూడు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తాగడం చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: