ముఖంపై జిడ్డును చిటికెలో పోగొట్టే పేస్ ప్యాక్ ఇదే..!
సాధారణంగా పుదీనాను మన ఇళ్లల్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు.ఇందులోని విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్,మింటు గుణాలు ముఖముపై జిడ్డును పోగొట్టడమే కాకుండా, ఇతర చర్మ వ్యాధులకు సైతం చెక్ పెడతాయి.ఇక పేస్ ప్యాక్ తయారీ విధానం చూద్దాం..
పుదీనా,వేప పొడి..
పుదీనా ఆకులలో విటమిన్ ఎ మరియు సాలిసిలిక్ యాసిడ్ పుష్కళంగా ఉంటుంది.ఈ గుణాలు మొటిమలను పోగొట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.ఈ ప్యాక్ కోసం మీక్సీ జార్ లో గుప్పెడు పుదీనా ఆకులు తీసుకొని,అందులోనే రెండు టేబుల్ స్ఫూన్ల వేపపొడి,నాలుగు కిరా ముక్కలు,ఒక స్ఫూన్ రోజ్ వాటర్ వేసి బాగా మీక్సీ పట్టాలి.
ఈ మిశ్రమాన్ని మొఖానికి అప్లై చేయాలి అనుకున్నప్పుడు,మొఖం బాగా శుభ్రం చేసుకొని,అప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేయాలి.ఇది బాగా ఆరడానికి అరగంట ఆగి,మొఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.ఇలా వారానికి రెండు రోజులు చేయడంతో మంచి ఫలితం ఉంటుంది.
ఇందులో వాడిన కిరా మరియు రోజ్ వాటర్ సహజ మాశ్చరైజర్ గా పని చేస్తాయి.మరియు చర్మ రంద్రాలు బాగా ఓపెన్ అవడానికి ఉపయోగపడి,జిడ్డు తొలిగేలా చేస్తాయి.అంతేకాక మొటిమలు,సెబం ఊత్పత్తి కాకుండా ఉండడానికి దోహదపడతాయి.
ఈ పేస్ ప్యాక్ తో పాటు జిడ్డుచర్మం కలవారు ఎక్కువగా వాటర్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.దీనితో కూడా జిడ్డును పోగొట్టుకోవచ్చు.మరీ ముఖ్యంగా జంక్ ఫుడ్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.