డయాబెటిక్ పేషెంట్లు ఎక్కువగా మాంసాహారం తినకూడదని సూచిస్తున్నారు. మీరు మాంసాహారులు, ఇంకా మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, చికెన్ తినడం సురక్షితమా కాదా అని మీరు గందరగోళానికి గురవుతుంటారు. కానీ చికెన్ ని తినడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిదేనంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఎందుకంటే చికెన్‌లో సన్నని ప్రొటీన్ ఉంటుంది.ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మీ ఆకలిని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఇక డయాబెటిక్ రోగులకు చికెన్ భిన్నంగా వండినట్లయితే, అది రక్తంలో చక్కెర స్థాయిని సాధారణీకరించడంలో చాలా సహాయపడుతుంది. చికెన్‌లో చాలా విటమిన్లు ఇంకా మినరల్స్ ఉంటాయి.అలాగే బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కానీ మీరు చికెన్ ఎలా ఉడికించాలి అనే దానిపై మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇక డయాబెటిక్ పేషెంట్లు చికెన్ ఎలా తినాలో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..
మీకు డయాబెటిస్ సమస్యలు కనుక ఉంటే, మీ ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే సలాడ్లను మీరు చేర్చుకోండి. ఇక చీజ్, టోఫు లేదా బీన్స్ శాఖాహారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే మీరు మాంసం తినాలనుకుంటే, మీరు గ్రిల్డ్ చికెన్ తినవచ్చు లేదా చికెన్ సలాడ్ ని తినవచ్చు. సలాడ్లు తయారుచేసేటప్పుడు మయోనైస్, క్రీమ్ ఇంకా సోయా సాస్ మొదలైన వాటిని ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి. మీరు చికెన్ సలాడ్‌లో ఆలివ్ నూనెను కూడా ఉపయోగించవచ్చు, ఇది డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఇక చికెన్ కర్రీలో నూనె, వెన్న లేదా క్రీమ్ ఎక్కువగా వాడితే ఇవి ఆరోగ్యానికి హానికరం. చికెన్ కర్రీ చేసేటప్పుడు ఈ పదార్థాలను ఎక్కువగా ఉపయోగించకూడదు. వాటిని తక్కువ పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.గ్రిల్డ్ చికెన్, వెజిటేబుల్స్ కలిపి చాలా రకాల వెరైటీలు తయారు చేసుకోవచ్చు.గోధుమ పిండి లేదా రాగుల పిండితో చేసిన రోటీలు లేదా పరోటా రోల్స్‌లో రుచికరమైన చికెన్ స్టఫింగ్ ని మీరు చేసుకోవచ్చు. ఇది మరింత పోషకమైనదిగా చేయడానికి, సలాడ్ ఆకులు, క్యాప్సికమ్, ఉల్లిపాయలు ఇంకా ఇతర కూరగాయలతో కలిపి చికెన్ ఫ్రై చేసుకుని మీరు తినొచ్చు.