కొత్తిమీర వల్ల ఇన్ని లాభాలా.. అసలు వదలకండి..?
కొత్తిమీర ను తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి.. ఆ ముక్కలను ఒక బౌల్లో వేసి నీటిని పోసి కాసేపు మరిగించాలి. అయితే ఇందులోకి కాస్త అల్లం ముక్క వేయడం మంచిది. ఇలా ఒక పది నిమిషాలు మరిగించిన తర్వాత ఈ నీటిని చల్లారిన తర్వాత వడగట్టి.. ఇందులోకి కాస్త తేనె వేసుకొని తరచు తాగుతున్నట్లు అయితే మన శరీరం ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా ఉంటుందట. కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడేవారు కొత్తిమీరను ఎలా తిన్నా సరే దివ్య ఔషధంలా ఉపయోగపడుతుంది. కొత్తిమీరను తినడం వల్ల కిడ్నీలో ఉండే మలినాలు సైతం తొలగిపోతాయి.
ముఖ్యంగా మహిళలు నెలసరి సమయంలో చాలా నొప్పితో పలు రకాల ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. తలనొప్పి కడుపునొప్పి కాళ్ల నొప్పులు వంటి సమస్యతో ఇబ్బంది పడేవారు కొత్తిమీర నీటిని తాగితే క్షణాలలో తగ్గిపోతుందట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల.. వెంటనే ఇమ్యూనిటీ పవర్ ను పెంచేలా చేస్తుంది.
కడుపులో ఎవరికైనా సరే మంటగా అనిపించినా .. ఒక గ్లాసు మజ్జిగలోకి కాస్త కొత్తిమీర వాటర్ ను , నిమ్మరసాన్ని వేసుకొని తాగడం వల్ల వెంటనే మంట నుంచి విముక్తి పొందవచ్చు. దగ్గు గొంతు నొప్పి ఉన్నవారు కూడా కొత్తిమీర రసం చాలా ఉపయోగపడుతుంది. అందుచేతనే కొత్తిమీరను తినడం చాలా మంచిదని నిపుణులు సైతం తెలుపుతుంటారు.