వీటిని పచ్చిగా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది?

Purushottham Vinay
మనం పచ్చిగా తీసుకోవాల్సిన ఆహారాల్లో ఖచ్చితంగా ఉల్లిపాయ కూడా ఒకటి.ఈ ఉల్లిపాయను మనం వంట్లలో ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఉల్లిపాయలను వేయించడం వల్ల వాటిలో ఉండే పోషకాలు నశిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని పచ్చిగా తీసుకోవడం వల్ల మాత్రమే మనకు మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయలల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా అల్లిసిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇవి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, గుండె జబ్బులను తగ్గించడంలో, అధిక రక్తపోటును తగ్గించడంలో ఇంకా ఎముకలను ధృడంగా చేయడంలో ఉపయోగపడతాయి. ఈ ప్రయోజనాలన్నింటిని మనం ఈజీగా పొందాలంటే ఉల్లిపాయలను పచ్చిగా తీసుకోవడమే మంచిది అని నిపుణులు చెబుతున్నారు.అలాగే బీట్ రూట్ ను కూడా మనం ఎప్పుడు పచ్చిగానే తీసుకోవాలి. మనం జ్యూస్ రూపంలో లేదా సలాడ్ రూపంలో బీట్ రూట్ ను తీసుకోవాలి.రక్తహీనతను తగ్గించడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో ఇంకా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇలా చాలా రకాలుగా దోహదపడుతుంది. వేయించి, ఫ్రై చేసి అలాగే ఉడికించి బీట్ రూట్ ను తీసుకోకూడదని ఇలా తీసుకోవడం వల్ల ఈ ప్రయోజనాల్నింటిని దూరం చేసుకున్న వాళ్లమవుతామని నిపుణులు చెబుతున్నారు.ఇంకా అలాగే మనలో చాలా మంది మొలకెత్తిన గింజలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటారు.



శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో, బరువు తగ్గడంలో ఇంకా జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇలా చాలా రకాలుగా మొలకెత్తిన గింజలు మనకు దోహదపడతాయి.అందుకే వీటిని కూడా మనం వీలైనంత వరకు పచ్చిగా తీసుకోవడానికే ప్రయత్నించాలి.అయితే కొందరు వీటిని వేయించి తీసుకుంటూ ఉంటారు. కొందరు మాత్రం కూరగా చేసి తీసుకుంటూ ఉంటారు.ఇలా చేయడం వల్ల పోషకాలు ఈజీగా ఆవిరైపోతాయి. కాబట్టి వీటిని కూడా పచ్చిగానే తీసుకోవాలి. ఇంకా అలాగే వంటలల్లో టమాటాలను విరివిరిగా వాడుతూ ఉంటాము. అయితే వేడి చేయడం వల్ల టమాటాలల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నశిస్తాయి. కాబట్టి వీటిని కూడా సలాడ్ రూపంలో పచ్చిగానే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంకా అలాగే వెల్లుల్లిని పేస్ట్ గా చేసి లేదా దంచి వంటల్లో వాడుతూ ఉంటాము. అయితే వెల్లుల్లిని పచ్చిగా తీసుకోవడమే మనకు మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వెల్లుల్లిని తేనెతో కలిపి నమిలి మింగాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: