ఓట్స్ తింటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..?

Divya
సాధారణంగా ఓట్స్ బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు ఎక్కువగా వీటిని తింటూ ఉంటారు.. అయితే ఇతర ఆహార పదార్థాల మాదిరిగా వీటిని తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు..అంతేకాకుండా బరువు పెరగడానికి కూడా దారితీస్తుందట. అందుకే ఓట్స్ ని ఏ విధంగా తినాలో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. ఓట్స్ ని కూరగాయలు లేకపోతే పండ్లలలో కలిపి తినవచ్చు .. కాని చక్కెర చాక్లెట్ వంటివి ఇతర స్వీట్స్ ను జోడించి తినకూడదట. ఇలా తినడం వల్ల మొత్తం పోషక విలువలు ఒకసారిగా తగ్గిపోతాయట.. దీంతోపాటు అదనపు క్యాలరీలు పెరిగి కొవ్వు పేరుకు పోయేలా చేస్తాయట.


ఓట్స్ ని రోజు అల్ప ఆహారంగా తీసుకోవడం మంచిదే కానీ ఇతర పదార్థాలతో కలిపి తీసుకోకూడదట.. అందుచేతనే ప్రతిరోజు అల్పాహారంగా కాకుండా వారానికి రెండు మూడు రోజులు మాత్రమే తినడం చాలా మంచిది. దీనివల్ల పలు రకాల పోషకాలు అందడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా ఆస్కారం ఉంటుందట. ఓట్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ ప్రక్రియ నెమ్మదిగా చేస్తుంది.. దీని వలన కడుపులో గ్యాస్ సమస్యలతో బాధపడుతున్న వారు వీటిని చాలా తక్కువగా తినడం మంచిదట.

ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మన శరీరానికి ఎక్కువ తినగలిగేలా చేస్తుంది ఓట్స్ అతిగా తినడం వల్ల పనికి ఆటంకం కలిగిస్తుంది దీంతో చురుకుగా ఉండలేక పోతారు. అందుచేతనే ఓట్స్ ను ఎంత తక్కువ మొత్తంలో తింటే అంత మంచిది. సాధారణంగా డైట్ ఫాలో చేసేవారు ఎక్కువగా ఓట్స్ ను తింటూ ఉండడం జరుగుతుంది.. ఇలాంటి వారు కూడా వీటిని తగ్గించి తినడం చాలా మంచిదట. ఓట్స్ కు బదులుగా రాత్రి సమయాలలో గోధుమలతో ఆడించిన పిండితో చపాతీలు తినడం చాలా మంచిదట. దీనివలన ఆకలి వేయకుండా ఉండడమే కాకుండా బరువు తగ్గుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: