చిలగడ దుంపలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తింటే నొప్పులు, వాపులు ఈజీగా తగ్గుతాయట. ఇంకా అంతేకాదు ఈ చిలగడ దుంపల్లో శరీరానికి శక్తిని, పోషకాలను అందించే కూడా చాలా గుణాలున్నాయి.ఈ చిలగడ దుంపలలో ఫైబర్, విటమిన్లు ఏ, సీ, బీ6, పొటాషియం, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి అనేక వ్యాధులు రాకుండా చూస్తాయి.ఇంకా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.వీటివల్ల పోషకాహార లోపం సమస్య రాకుండా చూస్తాయి. చిలగడ దుంపలలో బీటా కెరోటిన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక ఇది శరీరంలోకి చేరిన తర్వాత విటమిన్ ఏగా మారుతుంది. కంటి చూపుని బాగా మెరుగుపరుస్తుంది. చిలగడ దుంపలలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది.ఇది జీర్ణశక్తిని మెరుగుపరిచి.. ఆకలితో పాటు కొలెస్ట్రాల్ ను కూడా చాలా ఈజీగా తగ్గిస్తుంది.ఇక బరువు తగ్గాలనుకునేవారు చిలగడ దుంపలను కూడా తినవచ్చు. ఇవి తియ్యగా ఉంటాయి.అలాగే షుగర్ పేషంట్స్ కూడా వీటిని తినవచ్చు.ఇవి తియ్యగా ఉన్నా.. వీటిలో షుగర్ ను కంట్రోల్ చేసే సమ్మేళనాలు చాలా ఉంటాయి.
చిలగడ దుంపలలో ఉండే పొటాషియం హై బీపీని ఈజీగా తగ్గిస్తుంది. చిలగడ దుంపలలో ఉండే ఆంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు వాపులు ఇంకా నొప్పులను తగ్గిస్తాయి. ఈ చిలగడ దుంపలను చాలా మంది నీటిలో ఉడకబెట్టి తింటుంటారు. అయితే వీటిని నిప్పుల్లో కాల్చుకుని తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనం మైక్రో-ఓవెన్ లో కూడా ఈ చిలగడ దుంపలను కాల్చుకుని తినవచ్చు.ఈ చిలగడ దుంపలు కొన్ని రకాల కాన్సర్ల నుండి మనలని రక్షించడంలో సహాయపడతాయి. ఇంకా అలాగే మూత్రాశయం, పెద్ద ప్రేగు, కడుపు, రొమ్ములో పెరిగే కాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఈ చిలకడ దుంపలను తినడం వల్ల మెదడు పని తీరు బాగా మెరుగుపడుతుంది. జంతువులపై జరిపిన కొన్ని అధ్యయనాల్లో ఈ దుంపలోని ఆంథోసైనిన్లు మంటను తగ్గించి ఫ్రీ రాడికల్ డామేజ్ ను ఈజీగా తగ్గిస్తాయి. దానివల్ల మెదడు పనితీరు బాగా మెరుగుపడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.