భోజనం..కాఫీ వంటివి ప్లాస్టిక్ వాటిల్లో తింటున్నారా.. ఇది మీకోసమే..?

Divya
మనం ఎలాంటి ఫంక్షన్కు పార్టీకి వెళ్లిన సరే కచ్చితంగా టీ కాఫీలు అనేవి ఉండనే ఉంటాయి.. అయితే అక్కడ పేపర్ కప్పులు, కనిపిస్తూ ఉంటాయి. అయితే పేపర్లో ఉండే కెమికల్స్ కూడా ప్రాణాంతకరమైన వ్యాధులను కలిగిస్తాయని కొంతమంది నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.. మరి కొంతమంది పేపర్ ప్లేట్లల్లోనే టిఫిన్స్ భోజనాలు తదితర వాటిని తింటూ ఉన్నారు..ఇక మంచినీళ్లు కూడా ఇలాంటి వాటిలోనే అందిస్తూ ఉన్నారు.. ఎందుకంటే ఇంట్లో సామాన్లను తీసి కడగాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇలాంటి వాటికి ఎక్కువగా మక్కువ చూపుతున్నారు మహిళలు.


అయితే తాజాగా కొన్ని నివేదికలో ప్రకారం ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్ లో ఉపయోగించే పేపర్ ఉపరితల పూతతో ఉన్న ప్లాస్టిక్ చాలా ప్రమాదమట.. గ్లాసులో ఉన్న కాఫీ నుండి ఆ వేడికి కెమికల్ బయటికి విడుదలవుతుందట.. ఈ రోజుల్లో ప్లాస్టిక్ ఫిలిం పాలిలాక్లైడ్ PLA బయో ప్లాస్టిక్ రకం తో తయారు చేయబడుతోందట.. ఇందులో 99% ప్లాస్టిక్ ఉంటుందట. మామూలుగా ప్యాకేజింగ్ లో మొక్కజొన్న సరుగుడు చెరుకునుండి ఉత్పత్తి అయిన వాటిని ఎక్కువగా ఉపయోగించేవారు.. అయితే ఇవి అంత ప్రమాదం కాదట.. కానీ ప్లాస్టిక్ వాటికంటే ఎక్కువగా విచ్చిన్నం కాబోతోంది. ముఖ్యంగా కాలే వాటిని ఆ ప్లాస్టిక్ ప్లేట్ల పైన పెడితే కచ్చితంగా అందులో కెమికల్ వంటివి కరుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు.


ఈ మధ్యకాలంలో బయో ప్లాస్టిక్లతో తయారుచేసిన వాటిని నేల మీద నీటిమీద వేసినప్పుడు మాత్రం వెంటనే భూమిలో కలిసే గుణాన్ని కలిగి ఉండడం లేదని నిపుణులు తెలుపుతున్నారు.. ఈ కప్పుల వల్ల పర్యావరణానికి చాలా హాని కలుగుతోందని.. ప్లాస్టిక్ ప్రకృతిలో ఇలాగే కొనసాగితే జంతువులు మానవులు చాలా ప్రమాద బారిన పడే అవకాశం ఉంటుంది.. అందుకే పేపర్ ప్లాస్టిక్ వంటివి చాలా ప్రమాదంగా మారుతున్నాయి అందుకే వీలైనంతగా వీటిని తగ్గించి అరటి ఆకులలో టేకు ఆకులలో తినడం చాలా మంచిది. ఇవి తొందరగా భూమిలో కరిగిపోవడమే కాకుండా సారవంతమైన నేలను కూడా చేస్తాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: