యుక్త వయసులో వచ్చే మొండి మొటిమలను పోగొట్టే సింపుల్ చిట్కా ఏంటో తెలుసా..?

Divya
చాలామంది యుక్త వయసు పిల్లల్లో హార్మోనల్ చేంజెస్ మరియు పొల్యూషన్ వల్ల, ఆహారపు అలవాట్ల కారణంగా మొండి మొటిమలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని తగ్గించుకోవడానికి ఎంతటి కాస్లీ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడినా సరే ప్రయోజనం లేక,తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు.యుక్త వయసులో వచ్చే మొటిమలు ఒకటి రెండు రోజులు తగ్గిపోయినా కానీ,వాటి వల్ల కలిగే మచ్చలు మాత్రం అస్సలు తగ్గవు.కానీ యుక్త వయసులో ఉన్న పిల్లలకు మాత్రం అందంగా ఉండాలని,మిగతా వారి కంటే వారే స్పెషల్ గా కనిపించాలని కోరుకుంటూ ఉంటారు.అలాంటి వారి కోసం ఇంట్లో దొరికే వస్తువులతో తయారు చేసుకొనే చిట్కాలు చాలా ఉపయోగపడతాయని డెర్మటాలజిస్ట్ సైతం సూచిస్తూ ఉన్నారు.అవి ఏంటో తెలుసుకుందాం పదండి..
యుక్త వయసులో వచ్చే మొటిమలను తొందరగా పోగొట్టుకోవాలి అంటే,ముందుగా ప్రతి ఒక్కరూ హైడ్రేటెడ్ గా ఉండడానికి రోజు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తీసుకోవడం చాలా మంచిది.దీనితోపాటు ఇంట్లో దొరికే వస్తువులతో తయారు చేసుకునే చిట్కాలు చాలా బాగా ఉపయోగపడతాయి.
ఈ చిట్కా కోసం ముందుగా రెండు టీ స్పూన్ల ఎర్ర కందిపప్పు,రెండు టీ స్పూన్ల కలబంద గుజ్జు,రెండు స్పూన్ల టీట్రీ ఆయిల్ తీసుకోవాలి.ముందుగా ఎర్ర కందిపప్పు నానబెట్టుకుని మిశ్రమంలా తయారు చేసుకోవాలి.ఇందులోనే కలబంద గుజ్జు మరియు టీట్రీ ఆయిల్ కలిపి పక్కన పెట్టుకోవాలి.తరువాత ఈ మిశ్రమం ముఖానికి అప్లై చేయకముందు ముఖం బాగా శుభ్రం చేసుకోవడం వల్ల,ముఖంపై ఉన్న చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా అప్లై చేసి మెల్లగా మర్దన చేసుకోని,అరగంట పాటు ఆరనివ్వాలి. ఆరిన తరువాత ముఖాన్ని రుద్దుతూ గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ సమయంలో మొఖం పొడిబారినట్టు అవుతుంది.అందువలన సరైన మాశ్చరైజర్ ని అప్లై చేయాలి.ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల తొందరగా మొటిమలు పోగొట్టుకోవడమే గాక,వాటి తాలూకు మచ్చలను కూడా సమూలంగా తుడిచి వేయవచ్చు.ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే తొందరగా పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: