బ్లూ టీ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
సాధారణంగా బ్లూ టీ ని మన చుట్టుపక్కల పెరిగే అపరాజిత పూల నుంచి తయారుచేస్తారు.ఈ అపరాజిత పూలనే వాడుక భాషలో నీలం పూలని కూడా అంటారు.ఈ టీ కోసం ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి గుప్పెడు అపరాజిత పూలను వేసి,బాగా ఉడికించుకోవాలి.ఇది బాగా ఉడికి బ్లూ కలర్ లోకి మారిన తర్వాత చిటికెడు దాల్చిన చెక్కపొడి ,ఒక స్పూన్ తేనె,ఒక స్ఫూన్ నిమ్మరసం కలిపి తాగాలి.వీటిని పొద్దున లేవగానే తాగడం వల్ల శరీరం అంతా రిఫ్రెష్మెంట్ ఫీల్ అవుతుంది.అంతేకాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.అవేంటో చూద్దాం..
బ్లూ టీ ని రోజు తీసుకోవడంతో,ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది దీనితో సాధారణంగా వర్షాకాలంలో వచ్చే బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుంది.వాంతులు,విరోచనాలతో బాధపడేవారు ఈ పూలతో కాల్చిన టీ తీసుకోవడం వల్ల వెంటనే వారికి ఉపశమనం కలుగుతుంది.
అంతేకాక ఇందులో ఉండే యాంటీ గ్లైసటీన్ ప్రాపర్టీస్ చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.దీనితో ఎలాంటి చర్మ వ్యాధులు దరిచేరవు.మరియు వయసుతో పాటు వచ్చే చర్మంపై ముడతలను రాకుండా కాపాడుతుంది.ముఖాన్ని మెరిసేందుకు కూడా సహాయపడుతుంది.
బ్లూ టీలో ఆంథోసైనిన్ పుష్కళంగా లభిస్తుంది.ఈ సమ్మేళనంతో జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది.తలకు రక్తప్రసరణ బాగా పెరిగి,జుట్టు పొడవుగా,దృఢంగా తయారవుతుంది.
కావున ప్రతి ఒక్కరూ బ్లూ టీ తాగడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది.