పల్లీలు ఆరోగ్యానికి ఎంత మంచివంటే?

Purushottham Vinay
పల్లీలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి  తెలుసుకుందాం. ప్రతి రోజూ పల్లీలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. ఈ పల్లీలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి.వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి పెరగకుండా ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు పల్లీలను తీసుకోవడం వల్ల వీటిలో ఉండే ఫైబర్, అలాగే మేలు చేసే కొవ్వులు డయాబెటిస్ ను ఈజీగా అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. ఇంకా అదే విధంగా పల్లీలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఈ పల్లీలు మనకు ఎంతో సహాయపడతాయి. ఇంకా అలాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు రాకుండా కాపాడడంతో సహాయపడతాయి. ఇంకా అలాగే బరువు తగ్గాలనుకునే వారు పల్లీలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది.అలాగే ఈ పల్లీలల్లో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది.


అందువల్ల మనకు త్వరగా ఆకలి వేయకుండా ఉండడంతో పాటు ఇతర చిరుతిళ్లను తినకుండా ఉంటాము. బరువు తగ్గాలనుకునే వారు పల్లీలను స్నాక్స్ గా తీసుకోవడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ పల్లీలల్లో విటమిన్ బి3 ( నియాసిన్ ) ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరచడంలో, జ్ఞాపక శక్తిని పెంచడంలో, మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.అలాగే ఈ పల్లీలను తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ ను నశింపజేసి ఆరోగ్యకరమైన కణాలు క్యాన్సర్ కణాలుగా మారకుండా చేయడంలో ఉపయోగపడతాయి.పల్లీలను తీసుకోవడం వల్ల వృద్దాప్య ఛాయలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి.ఎందుకంటే వీటిలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. అలాగే చర్మంపై ముడతలు రాకుండా చేసి చర్యాన్ని అందంగా, ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో పల్లీలు మనకు ఎంతో సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: