ఈ సమస్యలున్న వారు గుడ్లని తినకండి?

Purushottham Vinay
ఈ సమస్యలున్న వారు గుడ్లని తినకండి?

HEALTH TIPS FOR GOOD health AND LONG LIFE

కోడి గుడ్డు అంటే ఇష్టపడని వారు ఎవరు వుండరు. ఎందుకంటే ఇది చాలా రుచిగా ఇంకా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అందుకే చాలా మంది కూడా రోజుకి ఒక్కసారైన కోడి గుడ్డు తింటారు.కోడిగుడ్లలో మన శరీరానికి అవసరమైన చాలా పోషకాలు ఉన్నాయి. అందుకే ప్రతి రోజూ కనీసం ఒక కోడి గుడ్డును అయినా తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు.అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం గుడ్లకు చాలా దూరంగా ఉండడమే మంచిదని వారు చెబుతున్నారు.జీర్ణ సమస్యలు అంటే గ్యాస్, మలబద్ధకం, అసిడిటీ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఖచ్చితంగా ఈ గుడ్లకు చాలా దూరంగా ఉండాలి.ఎందుకంటే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం ఇంకా కడుపు నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి.గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు అస్సలు తినకండి. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉన్నప్పుడే గుండెపోటు సంభవిస్తుంది. 



అందుకే ఈ క్రమంలో గుండె సమస్యలతో బాధపడుతున్నవారు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని పెంచే కోడి గుడ్లకు చాలా దూరంగానే ఉండాలి.చర్మ సమస్యలు ఉన్నవారు అస్సలు వీటిని తినకూడదు.గుడ్లలో చర్మానికి మేలు చేసే విటమిన్లు ఇంకా మినరల్స్ చాలానే ఉన్నాయి. అయితే అతిగా గుడ్లను తీసుకోవడం వల్ల మొటిమలు ఇంకా మచ్చలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇంకా శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడేందుకు కూడా అవకాశం ఉంది.ఇంకా అలాగే డయాబెటీస్ ఉన్నవారు తినకూడదు.కోడి గుడ్లను తీసుకోవడం వల్ల మధుమేహం సమస్యను ఈజీగా నియంత్రించవచ్చు. అయితే రోజుకూ 3 గుడ్ల కంటే ఎక్కువగా తీసుకుంటే మధుమేహం సమస్య కలిగే ప్రమాదం ఉంది.కాబట్టి మితంగా తినడం మంచిది.ఈ విధంగా పైన తెలిపిన ప్రకారం ఆ సమస్యలు ఉన్నవారు కోడి గుడ్లకు దూరంగా ఉండండి. ఎలాంటి సమస్యలు బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: