కళ్ళకింద వచ్చే నల్లటి వలయాలను పోగొట్టే సహజ పదార్థాలేంటో తెలుసా..?

Divya
ఈ మధ్య కాలంలో మొఖం ఎంత అందంగా, మెరుస్తూ వున్నా,కళ్ల కింద వచ్చే నల్లటి చారలు మాత్రం చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉన్నాయి.మరీ ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనబడుతూ వుంది.ఇలా రావడానికి కారణాలు టీవీ మొబైల్ ఎక్కువగా చూడటం,పోషకాహార లోపం,హార్మోనల్ సమస్యలు వంటి చెబుతున్నారు వైద్య నిపుణులు.


కానీ ఈ సమస్యలను ఏమి పట్టించుకోకుండా చాలామంది కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతూ,పై పైన పూతలు పూస్తూ ఉంటారు.అవి అప్పటికప్పటికీ బాగా అయినట్టు కనిపించినా తర్వాత మళ్ళీ వచ్చి తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు.అలాంటివారికి నాచురల్ గా దొరికే కొన్ని రకాల పదార్థాలతో వేసుకునే లేపనాలు చాలా బాగా ఉపయోగపడతాయని చర్మం నిపుణులు సూచిస్తూ ఉన్నారు.మరి ఏంటో మనము తెలుసుకుందాం పదండి..

బాదం ఆయిల్..

కళ్ళ కింద నల్లటి వలయాలతో బాధపడేవారు రోజూ బాదం ఆయిల్ ను తగినంత రీతిలో వేడి చేసి,కళ్ళ కింద అప్లై చేసుకోవాలి.ఇలా చేయడంతో ఇందులోని విటమిన్ ఈ నలుపుదనాన్ని తగ్గించి,చారలు లేకుండా కాపాడుతుంది.

క్యారెట్ రసం..

నల్లటి వలయాలను పోగొట్టేందుకు క్యారెట్ చాలా సహాయపడుతుంది.ఇందులో బిటా కెరొటీన్ పుష్కళంగా లభిస్తుంది. దీని కోసం ఒక టేబుల్ స్ఫూన్ క్యారెట్ జ్యూస్ మరియు ఒక స్ఫూన్ దోసకాయ రసాన్ని,అర స్ఫూన్ శనగపిండి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని కళ్ల కింద మరియు పైన బాగా అప్లై చేయాలి.అలానే 15-20 నిమిషాల తర్వాత అరనివ్వాలి.ఇలా వారానికి రెండు సార్లు అప్లై చేయడంతో నల్లటి వలయాలు తొలగిపోతాయి.

గ్రీన్ టీ బ్యాగ్స్..

వాడిన రెండు గ్రీన్ టీ బ్యాగులను తీసుకొని నీటిలో ముంచి,కొంత సమయం తరువాత,వాటిని ఫ్రిజ్‌లో ఉంచాలి.రోజూ రాత్రి పడుకోబోయే ముందు ఈ బ్యాగ్‌ని కళ్లపై పెట్టుకోని విశ్రాంతి తీసుకోవాలి.ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కంటి కింద నల్లటి వలయాలను తగ్గించడానికి దోహదపడతాయి.

అంతే కాక వీటితో పాటు పోషకాలు కలిగిన ఆహారం తినడం,టీవీ,మొబైల్ చూడటం తగ్గించడం వంటి వాటితో కంటి కింద నల్లటి వలయాలను తొందరగా తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: