శ్రీలంక టూర్‌ వెళ్తారా.. మీకు భలే గుడ్‌న్యూస్‌?

శ్రీలంక ఆ మధ్య తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. టూరిజం శ్రీలంక ఆర్థిక శక్తికి ప్రధాన ఆదాయ వనరు. అక్కడ బీచ్ లు, పబ్ లు, కాసినో ల ద్వారా ఆ దేశానికి ఆర్థికంగా ఎక్కువగా లాభం చేకూరుతుంది. అయితే ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిన తర్వాత ఆ దేశం ఆర్థికంగా కుదేలయింది. దీనికి తోడు కరోనా కూడా ఆ దేశ ఆర్థిక రంగాన్ని చావు దెబ్బ కొట్టింది.


ఇలాంటి సమయంలో భారత్ ఆదుకుని చాలా వరకు నిత్యావరసర సరుకులు, అప్పులు ఇచ్చి ఆదుకుంది. ఇప్పుడు శ్రీలంక అప్పుల బాధ నుంచి బయటపడి మళ్లీ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సరికొత్త ప్లాన్ అమలు చేస్తామని చెప్పింది. భారత్ సహా 7 దేశాల పౌరులకు శ్రీలంక వెళ్లడానికి వీసా అక్కర్లేదని తేల్చి చెప్పింది. పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇవ్వనుంది. భారత్, చైనా, రష్యా, జపాన్, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ దేశాలకు క్లియరెన్స్ ఇచ్చింది.


దీన్ని వచ్చే ఏడాదిగా కొనసాగించనుంది. శ్రీలంకకు వితౌట్ వీసా ద్వారా మార్చి 31 వరకు వెళ్లవచ్చు. దీన్ని ఫైలెట్ ప్రాజెక్టుగా చేపట్టినట్లు పేర్కొంది. ఇప్పటి నుంచి మార్చి 31 వరకు ఈ ఏడు దేశాల వారు శ్రీలంకలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చని దీనికి ఎలాంటి వీసా అవసరం లేదని తెలిపింది. మరి దీన్ని ఆయా దేశాల ప్రజలు ఏ మేరకు ఉపయోగించుకుంటారో చూడాలి.


తద్వారా శ్రీలంకకు ఆదాయం ఏ తీరుగా వస్తుందో చూసి మరిన్ని దేశాలకు కూడా వీసా లేకుండా శ్రీలంక పర్యటనకు వచ్చే విధంగా ప్రయత్నాలు చేయనుంది. కరోనా అనంతర పరిస్థితుల దృష్ట్యా లంకు పర్యాటకుల సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. పర్యాటకులు వస్తేనే శ్రీలంకకు ఆదాయం వస్తుంది. వారు ఎక్కువ రోజులు హోటళ్లు, రెస్టారెంట్లు, బీచ్ ల్లో తిరగడం. షాపింగ్ లు ఇలా అనేక రకాలుగా ఖర్చు పెట్టడం వల్ల ఆదాయం సమకూరనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: