గుండె జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
( health TIPS FOR GOOD health AND LONG LIFE )
ఈ రోజుల్లో జంక్ ఫుడ్ ను తీసుకోవడం, కొవ్వు ఉండే పదార్థాలను తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది గుండె సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయస్సులోనే అందరూ ఈ సమస్యల బారిన పడుతున్నారు. కొందరు అయితే గుండె సమస్యల కారణంగా ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.. అయితే కొన్ని ఆహారాలను సాయంత్రం తీసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్ రాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.అధిక కొవ్వులు కలగిన వాటిని తీసుకోవడం వల్ల గుండె సమస్యలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.. మాంసం ఖచ్చితంగా కొవ్వును పెంచుతుంది.. అందుకే మాంసాహారానికి బదులుగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఇతర ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి. పల్లీలు, రాజ్మా ఇంకా సోయాచిక్కుళ్లు వంటి ఆహారాల్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.
ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్ లభించడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది.అందువల్ల జన్మలో గుండె సమస్యలు రావు.ఇంకా కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. అలాగే శరీరంలో ఎక్కువగా ఉండే కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి చాలా మంది కూడా అన్నాన్ని తీసుకోవడం మానేస్తున్నారు. అయితే అన్నానికి బదులుగా అంతే శక్తిని ఇచ్చే ఇతర ఆహారాలను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా అన్నానికి బదులుగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి ఖచ్చితంగా తగినంత శక్తి లభిస్తుంది. ఇంకా కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.అలాగే ఎప్పటికి గుండె సమస్యలు రాకుండా ఉంటాయి..ఖచ్చితంగా తగినంత నీరు తీసుకోవాలి.. టైం కు తింటే ఎలాంటి సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..