స్పైసిఫుడ్ తిన్న తర్వాత పొట్టలో గడబిడను తగ్గించే ఆహారాలు ఇవే..!

Divya
ఈమధ్య కాలంలో చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి స్పైసి ఫుడ్డు మరియు జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటున్నారు.కానీ కొన్నిసార్లు తప్పక తినాల్సి వస్తూ ఉంది.దానివల్ల వారి పొట్ట ఆరోగ్యం ఏమైపోతుందో అని వారికి బెంగ కూడా ఉంటుంది.ఇలాంటి వారికి తిన్న తర్వాత ఎటువంటి పొట్ట సమస్యలు రాకుండా ఉండాలి అంటే,స్పైసి ఫుడ్ తిన్న తర్వాత వెంటనే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తూ ఉన్నారు.మీరు కూడా ఇలాంటి బెంగతో ఉంటే,కచ్చితంగా ఈ ఆహారాలను తీసుకోండి.

పాలు..

పాలలో కైసేన్ అనే ఎంజాయ్ ఉండడం వల్ల,స్పైసీ ఫుడ్ లోని క్యాప్సీసిన్ అనే అనే పదార్థాన్ని విచ్ఛిన్నం చేయడంలో ఉత్తమంగా పనిచేస్తుంది.దీనితో స్పైసి ఫుడ్ తిన్న తర్వాత వచ్చే పొట్ట సమస్యలన్నీ దరిచేరకుండా ఉంటాయి.అంతేకాక జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి.

పెరుగు..

పెరుగులో ఉన్న ప్రోబయాటిక్స్ స్పైసీ ఫుడ్ యొక్క గాఢత తగ్గించి,పొట్ట సమస్యలు రాకుండా కాపాడుతుంది.ఇలాంటి ఫుడ్ తినాల్సి వచ్చినప్పుడు కచ్చితంగా చివర్లో పెరుగుతో ముగించడం చాలా ముఖ్యం.

బ్రెడ్..

స్పైసి ఫుడ్ తిన్న వెంటనే బ్రెడ్ ముక్క తీసుకోవడం చాలా మంచిది.ఇందులో ఉన్న క్యాప్సిసిన్ ఎంజైమ్ ను విచ్చిన్నం చేయడానికి బ్రెడ్ లో ఉన్న ఈస్ట్ చాలా బాగా పనిచేస్తుంది.ఈసారి స్పైసీ ఫుడ్ తిన్న వెంటనే బ్రెడ్ ముక్క తీసుకోవడంతో మీ పొట్టను కాపాడుకున్న వారవుతారు.

 పీనట్ బటర్..

పీనట్ బటర్ లో అధికంగా మంచి నూనెలు మరియు కొవ్వులు ఉంటాయి.స్పైసి ఫుడ్ లో ఉన్న గాఢత తగ్గించి,జీర్ణ సమస్యలు మరియు పొట్ట సమస్యలు రాకుండా కాపాడుతుంది.

అరటిపండు..

చాలామంది ఫుడ్ తిన్న వెంటనే అరటిపండు తీసుకోవడం అలవాటే.కానీ స్పైసీ ఫుడ్డు తిన్న వెంటనే అరటిపండు తీసుకోవడంతో ఇందులో ఉన్న పెక్టేన్,స్పైసీ ఫుడ్ ని ఈజీగా విచ్ఛిన్నం చేస్తుంది.దీనితో కూడా స్పైసీ ఫుడ్ వల్ల కలిగే నష్టాలను తొలగించుకోవచ్చు.

ఆలివ్ ఆయిల్..

స్పైసీ ఫుడ్డు తిన్న వెంటనే ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల,జీర్ణక్రియ రేటు పెరిగి స్పైసి ఫుడ్ వల్ల కలిగే నష్టాలు తొలగిపోతాయి.కావున ఈసారి మీరు స్పైసీ ఫుడ్ తినాల్సి వస్తే,చివర్లో ఇవి మాత్రం కచ్చితంగా ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: