పోయేకాలం: నీ పెళ్లాం నాతో.. నా పెళ్లాం నీతో?

పాశ్చాత్య దేశాల విష సంస్కృతి మనకు అంటుకున్నట్లు కనిపిస్తోంది.  ఇలాంటి పార్టీలు కూడా ఉంటాయా అని పలువురు విస్మయానికి గురి అవుతున్నారు. చెన్నై శివారులో జరిగిన ఓ ఉదంతం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది సంచలనంగా మారడమే కాదు. పెద్ద ఎత్తున చర్చకు సైతం దారి తీసింది. తమిళనాడు రాష్ట్రంలో ఈ తరహా పార్టీలా? అన్న ఆశ్చర్యాన్ని కొందరు వ్యక్తం చేస్తుంటే మారుతున్న కాలానికి తగ్గట్టు ఈ తరహా దరిద్రపు అభిరుచులు తగలబడుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


తమిళనాడు రాజధాని చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు పై పనైయూర్ వద్ద ఒక ఫామ్ హౌస్ ను కొందరు పార్టీ కోసం బుక్ చేసుకున్నారు. ఈ వేడుకకు కొందరు పురుషులు, మహిళలు చేరుకున్నారు. అనంతరం పెద్ద ఎత్తున పాటలు పెట్టుకొని డ్యాన్స్ లు వేశారు. గంజాయి సేవించడంతో పాటు మద్యం ఇతర మత్తు పదార్థాల తీసుకొని వారు చేసిన చేష్టలకు ఫామ్ హౌస్ సిబ్బంది సైతం షాక్ తిన్నారు.


పార్టీకి హాజరైన పురుషులు.. మహిళల్ని మార్చుకోవడం (స్వాప్) చేసుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందింది. స్పందించిన అధికారులు ఫామ్ హౌస్ కు చేరుకొని తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఎనిమిది మంది మహిళలు, పదిహేను మంది పురుషులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. వీరిని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి  వచ్చాయి.


కొవై జిల్లాలోని మేట్టు పాళ్యానికి చెందిన సింథిల్.. ఆయన సతీమణి ఆర్థికంగా నష్టపోయారు. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా స్వాప్ పార్టీ అంటూ పెద్ద ఎత్తున గాలం వేశారు. వీరి మాటలకు ఆకర్షితులైన పలువురు పార్టీకి హాజరయ్యారు. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ తరహా పార్టీలకు ఆసక్తి చూపడం పట్ల పోలీసులు సైతం విస్తుపోయారు.  పాశ్చాత్య సంస్కృతి పేరుతో ఇండియాలో కూడా ఈ తరహా కార్యక్రమాలకు పాల్పడటం ఆందోళన కలిగించేదే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: