వాయు కాలుష్యం నుంచి కాపాడే వస్తువులు ఇవే?

Purushottham Vinay
ప్రస్తుతం దేశంలోని చాలా నగరాల్లో వాయు కాలుష్యం అనేది రోజురోజుకీ పెరుగుతోంది. ఢిల్లీతో పాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో రోజురోజుకీ వాయు కాలుష్యం స్థాయిలు విపరీతంగా పెరుగుతున్నాయి.ఇటీవల హైదరాబాద్‌లో కూడా వాయు కాలుష్యం పెరుగుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి.పరిశ్రమలు విపరీతంగా పెరగడం, ఇంధన వినియోగం ఎక్కువ కావడంతో వాయు కాలుష్యం బాగా పెరుగుతోంది. అయితే వాయు కాలుష్యం కారణంగా చాలా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అందువల్ల శ్వాస సంబంధిత వ్యాధులతో పాటు చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి ప్రమాదకర గంటలు మోగుతోన్న నేపథ్యంలో ప్రజలు ఇప్పుడు చాలా అలర్ట్ అవుతున్నారు. వాయు కాలుష్యం బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు పడుతున్నారు. ఇక ఈ క్రమంలోనే కొన్ని రకాల గ్యాడ్జెట్స్‌ అందుబాటులోకి వచ్చాయి.అయితే టెక్నాలజీకి అనుగుణంగా వాయు కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు కూడా మార్కెట్లోకి గ్యాడ్జెట్స్‌ అందుబాటులోకి వచ్చాయి.



ఇంట్లో గాలిని శుభ్రం చేసుకోవడానికి ఈ గ్యాడ్జెట్స్‌ బాగా ఉపయోగపడుతాయి. గాలిలోని కాలుష్య కారకాలను ఫిల్టర్‌ చేయడంలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. గాలిలోని విషపూరిత కారకాలను ఫిల్టర్‌ చేసి, మంచి గాలిని అందించే కొన్ని ఎయిర్‌ ప్యూరిఫైర్‌ ప్రొడక్ట్స్‌ గురించి తెలుసుకుందాం.. గాలిలోని కాలుష్యాన్ని తగ్గించడంలో ఎయిర్‌ ప్యూరిఫైయర్‌లు మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఫిలిప్స్‌, సామ్‌సంగ్‌తో పాటు ఎన్నో ఫేమస్ బ్రాండ్స్‌ వీటిని రూపొందిస్తున్నాయి.గాలిలోని కాలుష్యం నుంచి బయటపడడానికి N99/FFP2 మాస్క్‌ కూడా చాలా మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే ఈ మాస్క్‌ను  ధరిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈ మాస్క్‌ గాలిలోని మలినాలను ఈజీగా ఫిల్టర్‌ చేస్తుంది. అందువల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యల నుంచి రక్షించుకోవచ్చు. అలాగే మీరు పీల్చుతున్న గాలి ఎమేర నాణ్యమైందో కూడా తెలుసుకునే ఎయిర్‌ క్వాలిటీ మానిటర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీనిని ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎయిర్‌ క్వాలిటీని ఈజీగా తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: