వంటల్లో పసుపును ఎక్కువగా వాడుతూ ఉంటారు.ఈ పసుపు చక్కటి రంగుతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. పసుపును వాడడం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఎందుకంటే ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా పసుపును ఔషధంగా వాడితే ఉంటారు. పసుపును వాడడం వల్ల శరీరంలో రోగని రోధక శక్తి ఈజీగా పెరుగుతుంది. ఎందుకంటే దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు మనల్ని ఇన్పెక్షన్ ల బారి నుండి కాపాడడంలో దోహదపడతాయి. పసుపును వాడటం వల్ల శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీరంలో కొవ్వును కరిగించడంలో, బరువు తగ్గడంలో, షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో ఇలా చాలా రకాలుగా పసుపు మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది.అయితే ఆరోగ్యానికి మంచి చేస్తుందని కదా అని పసుపును ఎక్కువగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పసుపును ఎక్కువగా వాడడం వల్ల మనం వివిధ రకాల దుష్ప్రభావాల బారిన పడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక పసుపును ఎక్కువగా వాడడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనం రోజుకు 500 నుండి 2000 మిల్లీ గ్రాముల మోతాదులో మాత్రమే పసుపును ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పసుపును అధిక మోతాదులో తీసుకోవడం వల్ల జీర్ణాశయ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు నిపుణులు చెబుతున్నారు. పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో నొప్పి, డయేరియా ఇంకా యాసిడ్ రిప్లెక్స్ వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ఇంకా అలాగే 450 మిల్లీ గ్రాముల కంటే పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరిలో తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంకా అలాగే పిత్తాశయంలో రాళ్ల సమస్య తలెత్తే అవకాశం కూడా ఉంది.పసపును అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు మరింత ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా అలాగే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు పసుపును ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే రక్తస్రావం సమస్యలతో బాధపడే వారు, జీర్ణాశయ సమస్యలతో బాధపడే వారు, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు పసుపును వీలైనంత తక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.