మిల్లెట్ బ్రెడ్ తో కలిగే లాభాలు తెలిస్తే సాధారణ బ్రెడ్ జోలికే వెళ్ళరు..!

Divya
సాధారణంగా బ్రెడ్ ను పూర్వం రోజుల్లో జ్వరం గట్రా వచ్చినప్పుడు సులభంగా జీర్ణం అయ్యేందుకు ఎక్కువ పెడుతుండేవారు.కానీ ఇప్పటి పిల్లల తల్లిదండ్రులు ఈ బ్రెడ్ ను కేక్ ల రూపంలోనూ,బ్రెడ్ జామ్,బ్రెడ్ ఆమ్లెట్ అంటూ రకరకాల స్నాక్స్ రూపంలో అందిస్తున్నారు.కానీ ఈ బ్రెడ్ ని మైదా ఉపయోగించి,దానిని పులియ బెట్టి, రకరకాల పదార్థాలను ఉపయోగించి తయారు చేయడం వల్ల,ఇది అధిక బరువుకి దారి తీయడమే కాక,అనేక జీర్ణ సమస్యలను కూడా కొనితెస్తూ ఉంది.కానీ ఇలాంటి బ్రెడ్ ఎక్కువగా తినే వారి కోసం మిల్లెట్ బ్రెడ్ బాగా ఉపయోగపడుతుంది.దానితో వారికి నోటికి రుచిగాను జీర్ణ సమస్యలన్నీ రాకుండా ఉంటాయి.మీరు కూడా ఇలా బ్రెడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారా అయితే మిల్లెట్ బెడ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం పదండీ..

ఈ మిల్లెట్ బ్రెడ్ తయారు చేయడానికి మైదాపిండికి బదులుగా ఎక్కువగా రాగులు,సజ్జలు,జొన్నలు మరొకటించి పిండి మన పట్టించిన పిండితో బ్రెడ్ తయారు చేస్తారు.ఈ మిల్లెట్స్ కి సాధారణంగా శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో చాలా బాగా సహాయపడతాయి.అంతేకాక వీటితో తయారుచేసిన బ్రెడ్ ని వ్యాధిగ్రస్తులకు ఇవ్వడం వల్ల వివిధ రకాల వ్యాధులనుండి తొందరగా కోలుకుంటారు.

ఇందులో యాంటీఆక్సిడెంట్లు,ఫైబర్,ప్రొటీన్లు మరియు విటమిన్లు,ఐరన్,జింక్,విటమిన్ B3,విటమిన్ B6 మరియు విటమిన్ B9 మరియు మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

ఈ బ్రెడ్ తినడం వల్ల తల్లిలోని పాల ఉత్పత్తి పెరిగి, బిడ్డకు కూడా సరైన పోషణ అందుతుంది.గర్భిణీ స్త్రీలు ఈ బ్రెడ్ తరచూ తీసుకోవడం వల్ల ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు కూడా.అంతేకాక సుఖప్రసావానికి ఉపయోగపడే విటమిన్ b6,b3 కూడా అధికంగా లభిస్తాయి.

అధిక బరువుతో బాధపడేవారికి ఇది మంచి ఆహారమని చెప్పవచ్చు.ఇందులో ఉన్న అధిక పైబర్ తో జీర్ణశక్తి మెరుగుపడటమే కాకుండా,చెడు కొవ్వులను కరిగించడంలో కూడా సహాయపడుతుంది.ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లతో సీజనల్గా వచ్చే వ్యాధులకు కూడా గుడ్ బై చెప్పవచ్చు.కావున ఇన్ని ప్రయోజనాలు కలిగిన మిల్లెట్ బ్రెడ్ ని అస్సలు తినకుండా వదలకండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: