మనం ప్రతి రోజూ బియ్యంతో చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ అనేది చాలా ఎక్కువగా తయారవుతుంది. ఇంకా అలాగే గుడ్లు, మాంసం వంటి జంతు సంబంధిత ఆహారాలను తీసుకోవడం వల్ల నేరుగా శరీరంలోకి కొలెస్ట్రాల్ వెళ్తుంది.కానీ మన శరీరానికి రోజుకు కేవలం 300 గ్రా కొలెస్ట్రాల్ మాత్రమే అవసరమవుతుంది. చాలా మంది శరీరంలో ఎక్కువగా ఉన్న కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి వెల్లుల్లి రెబ్బలను తీసుకుంటూ ఉంటారు. పరగడుపున తింటూ ఉంటారు. ఇంకా వంటల్లో కూడా వెల్లుల్లిని వాడుతూ ఉంటారు. అయితే వెల్లుల్లిని వాడడం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇంకా అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. వెల్లుల్లిలో ఉండే ఆల్పాలెనొనిక్ యాసిడ్ మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో చాలా బాగా దోహదపడుతుంది.
ఇక ఇది నిజమే అయినప్పటికి చాలా మందిలో వెల్లుల్లిని తీసుకున్నప్పటికి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక వెల్లుల్లిని తీసుకుంటూనే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటున్నారు.అందువల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. ఇలా వెల్లుల్లిని తీసుకున్నప్పటికి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గాలంటే మనం మన ఆహార నియమాలను ఖచ్చితంగా మార్చుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువ తీసుకోవాలి. ఇంకా జంతు సంబంధిత ఆహారాలను తక్కువగా తీసుకోవాలి. మన జీవన విధానంలో ఖచ్చితంగా మార్పులు చేసుకోవాలి. అలాగే ఆకుకూరలు, కూరగాయలను, పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ ను కరిగించడంలో సహాయపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ ఈజీగా తొలిగిపోతుంది. వెల్లుల్లితో పాటు మన ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల మనం చెడు కొలెస్ట్రాల్ సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చని అప్పుడే గుండె జబ్బులు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.